అభివృద్ది పనుల కోసమే మోడీ విశాఖ టూర్:బీజేపీ ఎంపీ జీవీఎల్

By narsimha lodeFirst Published Nov 9, 2022, 2:52 PM IST
Highlights


అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడం కోసమే ప్రధాని నరేంద్రమోడీ విశాఖపట్టణం టూర్ కు వస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు.

విశాఖపట్టణం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ది పనుల కోసమే ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటనకు వస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. ప్రధాని విశాఖ పర్యటనను రాజకీయం చేయడం తగదన్నారు.బుధవారంనాడు విశాఖపట్టణంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మీడియాతో మాట్లాడారు.అత్యంత బిజీషెడ్యూల్ లో కూడ  ప్రధాని మోడీ రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్నారని ఆయన చెప్పారు.విశాఖపట్టణంలో ఒకటిన్నర రోజులపాటు ప్రధాని ఉంటారని ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు.

ప్రధానికి ఘనంగా స్వాగతం పలికేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.పాతఐటీఐ నుండి కంచరపాలెం వరకు ప్రధాని రోడ్ షో ఉంటుందని ఎంపీ జీవీఎల్ చెప్పారు. ఈ నెల 12న ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని ఆయన వివరించారు.విశాఖపర్యటనలో తొమ్మిది ప్రాజెక్టులకు ప్రధాని శంకు్థాపనలు చేస్తారని జీవీఎల్ వివరించారు. ప్రధాని టూర్ మినిట్ టూ మినిట్ ప్రోగ్రాం షెడ్యూల్ ఇవాళ సాయంత్రానికి ఖరారు కానుందని  ఆయన చెప్పారు. ప్రధాని పాల్గొనే సభను విజయవంతం చేసేందుకు తమ పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందన్నారు. 

alsoread:విశాఖలో ఉద్రిక్తత:కార్మికుల బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపై బైఃఠాయింపు

ప్రధానమంత్రి ఈ నెల11,12 తేదీల్లో విశాఖపట్టణంలో పర్యటించనున్నారు.  విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనకు పిలుపునిచ్చాయి.  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విసయంలో వెనక్కు తగ్గబోమని కేంద్రం ఇదివరకే ప్రకటించింది.అయితే ప్రధాని విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ విషయమై ఒత్తిడి తేవాలని కార్మికసంఘాలు భావిస్తున్నాయి.

అదే విధంగా తెలంగాణ జిల్లాలో కూడ ప్రధాని పర్యటించనున్నారు. ఈ నెల12న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం ఎరువుల ప్యాక్టరీని ప్రధాని మోడీ ప్రారంభిస్తారు.ప్రధాని మోడీ టూర్ ను అడ్డుకొంటామని విద్యార్థీ జేఏసీ ప్రకటించింది. ఏడాది క్రితమే ప్రారంభించిన ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించడం ఏమిటని సీపీఐ ప్రశ్నించింది.ప్రధాని టూర్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ఆ  పార్టీ  ప్రకటించింది. 

click me!