అమరావతిలో రాజధానిని అప్పటి విపక్షనేత జగన్ అంగీకరించారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చెప్పారు. ఏపీ రాష్ట్ర శాసనమండలిలో జగన్ సర్కార్ మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ బిల్లును ప్రవేశ పెట్టింది.
అమరావతి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేయాాలని నిర్ణయం తీసుకొన్న సమయంలో అప్పట్లో విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ అంగీకరించారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ గుర్తు చేశారు. అమరావతిలో విపక్షనేతగా Ys jagan ఇల్లు కట్టుకోవడాన్ని ఆయన అభినందించారు. అయితే అప్పటి సీఎం చంద్రబాబుకు అమరావతిలో స్వంత ఇల్లు లేదన్నారు. గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం భూమి సేకరణ కోసం ల్యాండ్ పూలింగ్ జరిగిందన్నారు. ఈ ల్యాండ్ పూలింగ్ సమయంలో పెద్ద ఎత్తున రైతులు భూమిని ఇచ్చారన్నారు.
Amaravati రాజధాని నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో అసైన్డ్ భూముల సేకరణ సమయంలో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్నారు. అంతేకాదు భవనాల నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందన్నారు. Chandrababu సర్కార్ సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలో 144 సెక్షన్ అమల్లో ఉన్న విషయాన్ని madhav గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయంలో కూడా అమరావతిలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. ప్రభుత్వాలు మారినా కూడా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు.గతంలో అమరావతిలో రైతుల సమస్యలపై తమ పార్టీతో పాటు జనసేన చీఫ్ Pawan kalyan కూడా పర్యటించామని ఆయన గుర్తు చేశారు.
also read:శాసనమండలికి మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు: ప్రవేశ పెట్టిన ఏపీ మంత్రి బుగ్గన
అంతకు ముందు ఈ బిల్లును ఏపీ శాసనమండలిలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మూడు రాజధానుల చట్టం తీసుకు రావడానికి దారి తీసిన పరిస్థితులతో పాటు ప్రస్తుతం ఈ చట్టం ఉపసంహరణ బిల్లుపై కూడా మంత్రి వివరించారు.కానీ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మాత్రం హైద్రాబాద్ లో మాత్రమే అభివృద్ది చోటు చేసుకొందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఒకే చోట అన్ని సంస్థలు పెడితే ఏ ప్రాంతం కూడా అభివృద్ది చెందదని మంత్రి అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని అధికార వీకేంద్రీకరణకు ప్రాధాన్యతను ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నామని చెప్పారు
ఏపీసీఆర్‌డీఏ యాక్ట్‌ను అమరావతి మెట్రోపాలిటిన్ రీజన్ ఏరియాగా మార్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. . జోన్లు, ప్రాంతాలు, నగరాలు ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చెప్పారు.
అయితే ప్రధానంగా రాజకీయాల వల్ల ప్రాంతీయతత్వం కొంతమందిలో రెచ్చగొట్టారు. ఈ ప్రభుత్వం మీద, సీఎం మీద సంపూర్ణ నమ్మకం ఉండటంతో వేరే సబ్జెక్ట్ లేక అమాయకుల్ని రెచ్చగొడుతూ హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వస్తూ నటిస్తున్నారన్నారు.ఎవరెవరైతే ఒకశాతమో, రెండు శాతమో వీరి ప్రలోభాలకు లోనైతే వారి ప్రశ్నలకూ సమాధానం చెబుతామని మంత్రి తేల్చి చెప్పారు. హేతుబద్ధతో సమాధానం చెబుతామన్నారు. పాలసీపై ఒకటికి, రెండు శాతం మందితో చర్చించి
నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్క రీజియన్ సంతోషంతో ముందుకు వెళ్లాల్సి ఉంది. ఎంతో ఉదారత్వంతో చట్టాల్ని రద్దు చేస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.