Heavy Rains : 24 గంటల్లో ముంచుకురాబోతున్న మరో అల్పపీడనం.. ఏపీలోని ఆ సరిహద్దు గ్రామాలకు అలర్ట్....

By AN TeluguFirst Published Nov 23, 2021, 11:18 AM IST
Highlights

రానున్న 24 గంటల్లో దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావం శ్రీలంక-దక్షిణ తమిళనాడుపై తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తుంది బుధవారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలు, వరదల కారణంగా వారం రోజులుగా క్షణమొకయుగంలా గడుపుతున్నాయి. వరుణుడికి బీపీ వచ్చి ఏపీలోని వణికించినట్టు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు గడగడలాడిపోతోంది. ప్రస్తుతం వరుణుడు శాంతించాడు. కానీ వర్షాలు, వరదల కారణంగా మిగిలిన బురద అలాగే ఉంది. ఆ బురదలోనే జనం నాని పోతున్నారు. కన్నీరుమున్నీరవుతున్నారు.  రికార్డుస్థాయిలో కురిసిన వర్షాలు, వరదల నుంచి ఇంకా తేరుకోకముందే మరో ముప్పు ముంచుకొస్తుంది.

రానున్న 24 గంటల్లో దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని Department of Meteorology ప్రకటించింది. దీని ప్రభావం శ్రీలంక-దక్షిణ తమిళనాడుపై తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తుంది బుధవారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి Heavy rains పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అయితే తమిళనాడు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, కాగా, చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను వర్షాలు వదలడంలేదు, వరదలతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. చాలా చోట్ల భారీగా పంట నష్టం జరగగా,  ఇప్పటికే పలు గ్రామాలు Flood ముంపులోనే ఉన్నాయి. దీంతో చాలా మంది పునరావాస కేంద్రాల్లోనే గడుపుతున్నారు. మరోవైపు పలుచోట్ల రోడ్లు, రైల్వే ట్రాక్ కుంగిపోయాయి. అయితే తాజాగా సోమవారం చిత్తూరు జిల్లాలోని దాదాపు 100 
Villages ప్రమాదపు అంచుకు చేరుకున్నాయి.

జిల్లాలోని రామచంద్రపురం మండలంలోని Royal Pond వర్షాల కారణంగా పూర్తిగా నిండిపోయింది.  అంతేకాకుండా పలు వైపుల నుంచి చెరువుకు భారీగా Flood water చేరుతుంది. అయితే చెరువుకు చిన్న గండి పడి నీరు లీక్ కావడం ఆందోళనకు గురి చేస్తుంది.  కట్ట నుంచి మట్టి క్రమంగా జారి పోతున్నట్టుగా అధికారులు గుర్తించారు ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. చెరువుకు గండి పడకుండా చర్యలు చేపట్టారు. 

లీకేజీలు పూడ్చడానికి, చెరువు కట్ట ను పటిష్ట పరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇందుకోసం ఎన్డిఆర్ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.  మరోవైపు ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.  ఇప్పటికే 20 గ్రామాల ప్రజలను Rehabilitation Centersకు తరలించారు మరికొన్ని గ్రామాలను అప్రమత్తం చేశారు నుంచి ఉండడంతో చెరువు పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

హిందూపురంలో తృటిలో తప్పిన ప్రమాదం: వరద నీటిలో చిక్కుకొన్న ఆర్టీసీ బస్సు, 30 మంది ప్రయాణీకులు క్షేమం

కాగా, భారీ వర్షాల కారణంగా ఏపీ లోని పలు జిల్లాలు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద సహాయక చర్యలపై అసెంబ్లీ ఛాంబర్లో అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.  

బాధితులకు ప్రతీ ఒక్క ఇంటికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె,  కేజీ ఉల్లిపాయ,  కేజీ ఆలుగడ్డ,  రెండు వేల రూపాయలు ఇవ్వాలని,  ఇల్లు కూలిపోయినా,  పాక్షికంగా దెబ్బతిన్నా...వారికి వెంటనే నగదు, పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిన వారికి రూ. 95,100 డబ్బులు, ఇల్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరు, పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ.5200 నగదు, చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అలాగే నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి తోడుగా ఉండాలని, వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని,  ఆ కుటుంబాల రూ. 25లక్షల పరిహారం అందించాలని తెలిపారు. 

click me!