Mudragada Padmanabham: ‘మీ పతనం చూడాలనే.. ఆ రోజు ఆత్మహత్య చేసుకోలేదు’.. చంద్రబాబుకు ముద్రగడ లేఖ

By team teluguFirst Published Nov 23, 2021, 11:40 AM IST
Highlights

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham ) మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు పతనం చూడాలనే నాడు తాను ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానంటూ ముద్రగడ సంచల వ్యాఖ్యలు చేశారు.
 

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham ) మరోసారి ఫైర్ అయ్యారు. ఇటీవల చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడానికి సంబంధించి ముద్రగడ ఆయనకు లేఖ రాశారు. చంద్రబాబు పతనం చూడాలనే నాడు తాను ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానంటూ ముద్రగడ ఆ లేఖలో సంచల వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. ఇటీవల అసెంబ్లీలో తన భార్యను దూషించారంటూ చంద్రబాబు ప్రెస్‌ మీట్‌లోనే వెక్కి వెక్కి ఏడ్చిన (Chandrababu breaks into tears) సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన ముద్రగడ పద్మనాభం.. kapuలకు ఇచ్చిన హామీ కోసం నాడు దీక్ష ప్రారంభిస్తే అవమానించారని.. గతంలో తమ కుటుంబానికి చేసిన అవమానం గుర్తు లేదా అని ప్రశ్నించారు. తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ ఈడ్చుకెళ్లడం చంద్రబాబుకు గుర్తు లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపంచారు. 

‘మీ శ్రీమతి గారికి జరిగిన అవమానం గురించి మీరు బాధపడుతూ వెక్కి వెక్కి ఏడవడం టీవీలో చూసి చాలా ఆశ్చర్యపోయను. మీకన్నా మా కుటుంబానికి కొద్దొ గొప్పో చరిత్ర ఉంది.  మా తాత గారు పేరుకే కిర్లంపూడి మునసబు గాని, జిల్లా మునసబుగా పేరు గడించారు. నా తండ్రిని ప్రజలు రెండు సార్లు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా అసెంబ్లీకి పంపారు. మీరు, నేను 1978లో అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ వద్ద, ఆ తర్వా మీ వద్ద చాలా కాలం పనిచేశారు. మీకు వెన్నుపోటు పొడవాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. 

మా జాతికి ఇచ్చిన హమీని అమలు చేయమని ఉద్యమం చేస్తే.. నన్ను నా కుటుంబాన్ని మీరు చాల అవమాన పరిచారు. మీ కుమారుడు లోకేష్ (nara lokesh) ఆదేశాలతో పోలీసులు నన్ను బూటు కాలితో తన్నారు. నా భార్య, కుమారుడు, కోడల్ని బూతులు తిడుతూ లాఠీలతో కొట్టారు. 14 రోజుల పాటు ఆస్పత్రి గదిలో నన్ను.. నా భార్యను ఏ కారణంతో బంధించారు. మీ రాక్షస ఆనందం కోసం ఆస్పత్రిలో మా దంపతులను ఫోటోలు తీయించి చూసేవారు.

మీరు చేసిన హింస తాలుకూ అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం. అణిచివేతతో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది మీ ప్రయత్నం కాదా?. నా కుటుంబాన్ని అవమానపరచిన మీ పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నా. నా కుటుంబాన్ని ఎంతగానో అవమానించిన మీ నోటి వెంట ఇప్పడు ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. ఆ రోజు జరిగిన ఘటనలు మీకు గుర్తు చేయడానికే తప్ప.. మిమ్మల్ని, మీ శ్రీమతిని అవమానించడానికి ఈ లేఖ రాయలేదు’ అని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపు ఉద్యమాన్ని (Kapu agitation) ముద్రగడ ముందుడి నడిపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తునిలో కొన్ని హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కాపు ఉద్యమం కోసం ముద్రగడ కిర్లంపూడిలో ఉన్న ఆయన ఇంట్లోనే నిరహార దీక్షలకు కూర్చున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో చంద్రబాబు, లోకేశ్‌లు తన కుటుంబం పట్ల దారుణంగా వ్యవహరించారని ముద్రగడ విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే, కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడ.. గతేడాది కాపు ఉద్యమానికి ఇక తాను నాయకత్వం వహించలేనని ముద్రగడ స్పష్టం చేశారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు లేఖ రాసిన ముద్రగడ మరోసారి వార్తల్లో నిలిచారు. 

click me!