మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్ర అభివృద్దికి ఏం చేశారు..?: వికేంద్రీకరణకు మద్దతుగా సమావేశంపై సత్యకుమార్ ఫైర్

By Sumanth KanukulaFirst Published Sep 25, 2022, 2:27 PM IST
Highlights

అమరావతి రైతుల పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. అసమర్ద పాలనను కప్పిపుచ్చుకోవడానికే జగన్ సర్కార్ కొత్త నాటకానికి తెరతీసిందని విమర్శించారు.

అమరావతి రైతుల పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. అసమర్ద పాలనను కప్పిపుచ్చుకోవడానికే జగన్ సర్కార్ కొత్త నాటకానికి తెరతీసిందని విమర్శించారు. ఆదివారం సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రైతులు పాదయాత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే జగన్ సర్కార్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చిందని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని అన్నారు. మూడున్నరేళ్ల పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్దిని పట్టించుకోని వైసీపీ నేతలు.. ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. 

అమరావతి రైతులుకు బీజేపీ అండంగా ఉంటుందని చెప్పారు. అమరాతి రైతుల పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రైతుల యాత్రకు వస్తున్న స్పందన వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు నచ్చడం లేదని అన్నారు. మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్ర అభివృద్దిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించలేదని ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్ర చేస్తున్నారనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. రైతుల యాత్రకు భంగం కలిగించేలా, పాంత్రాల మధ్య గొడవలు పెంచేలా, రైతుల మీద దాడులు జరిగేలా కుట్రలో భాగంగానే రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 

మూడున్నరేళ్లలో ఏం అభివృద్ది చేశారో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.  ఉత్తారంధ్రకు ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. ఏం సాధించారని వైసీపీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రను గంజాయి సాగు ప్రాంతంగా మార్చారని విమర్శించారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 

click me!