మాణిక్యాల రావు దీక్ష భగ్నం: ఆస్పత్రికి తరలింపు

By pratap reddyFirst Published Jan 23, 2019, 6:41 AM IST
Highlights

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి హామీల కోసం మాజీ మంత్రి, బిజెపి నేత మాణిక్యాల రావు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం రాత్రి ఆయనను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. 

తాడేపల్లిగూడెం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి హామీల కోసం మాజీ మంత్రి, బిజెపి నేత మాణిక్యాల రావు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం రాత్రి ఆయనను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. 

తాడేపల్లిగూడేనికి చంద్రబాబు 56 హామీలు ఇచ్చారని చెబుతూ వాటిని అమలు చేయాలని మాణిక్యాల రావు సోమవారం ఉదయం దీక్షను ప్రారంబించారు. 

తన నిరవధిక నిరాహార దీక్షను తొలుత తహాశీల్దార్ కార్యాయలం దగ్గర చేపట్టాలని మాజీమంత్రి భావించారు. అయితే అందుకు అనుమతి లేదని చెప్పడంతో ఆయన క్యాంప్ కార్యాలయంలోనే దీక్షకు దిగారు.

గత నెల 25న చంద్రబాబు నాయుడుకి అల్టిమేటం ఇచ్చారు పైడికొండల మాణిక్యాలరావు. నెల రోజులు దాటినప్పటికి ముఖ్యమంత్రి నుంచి స్పందనరాకపోవడంతో సోమవారం నుంచి దీక్ష ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

చంద్రబాబు హామీలు హుష్ కాకి: దీక్షకు దిగిన మాణిక్యాలరావు

దీక్షకు దిగుతున్నా, చంద్రబాబు కళ్లు తెరవాలి : మాజీమంత్రి మాణిక్యాలరావు

నేను త్యాగం చేస్తేనే ఎమ్మెల్యే అయ్యావ్ : ఈలి నాని

చిల్లర రాజకీయాలు మానుకో: మాణిక్యాల రావుకు చంద్రబాబు వార్నింగ్

మాజీ మంత్రి మాణిక్యాల రావు సంచలన నిర్ణయం

మాజీ మంత్రి మాణిక్యాలరావుకు అస్వస్థత...ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

రాబోయే ఎన్నికల్లో టీడీపీ భవితవ్యంపై మాజీమంత్రి జోస్యం

click me!