రైతులు భూములిచ్చింది ప్రభుత్వానికి.. పార్టీలకు కాదు: పురంధేశ్వరీ

By Siva Kodati  |  First Published Dec 21, 2019, 8:33 PM IST

పార్టీల కోసం రైతులు భూములు రైతుల ఇవ్వలేని, ప్రభుత్వానికి మాత్రమే రైతులు భూములు ఇచ్చారని స్పష్టం చేశారు బీజేపీ నేత పురంధేశ్వరి. 


పార్టీల కోసం రైతులు భూములు రైతుల ఇవ్వలేని, ప్రభుత్వానికి మాత్రమే రైతులు భూములు ఇచ్చారని స్పష్టం చేశారు బీజేపీ నేత పురంధేశ్వరి. శనివారం రాజధాని గ్రామాల రైతులు ఆమెను కలిసి.. అమరావతిని మార్చవద్దని కోరారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణను మొదటి నుంచి బీజేపీ సమర్దిస్తుందన్నారు.

రైతులు తమ ఆవేదనను తెలియజేసారని.. ఇందుకు టీడీపీ, వైసీపీలు సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్రం  నిధులు ఇచ్చినా చంద్రబాబు గ్రాఫిక్స్ కి పరిమితం అయ్యారని పురంధేశ్వరి ఎద్దేవా చేశారు. రాజధాని విషయం పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వం రైతులకు సమాధానం ఇవ్వాలని పురంధేశ్వరి కోరారు.

Latest Videos

Also Read:పరిపాలనా రాజధానిగా భీమిలీ: మరో బాంబు పేల్చిన విజయసాయి

జీఎన్ రావు కమిటీ బహిర్గతం అవలేదు, క్యాబినెట్ లో చర్చ జరగాలని, రైతులకు సమాధానం చెప్పిన తర్వాత మూడు రాజధానులపై బీజేపీ స్పందిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అప్పటి ప్రభుత్వంపై విశ్వాసంతో రైతులు భూములు ఇచ్చారు, వారి ఆవేదనకు ఆందోళనకు ఇప్పటి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. 

అంతకుముందు రాజధాని మార్పుతో రాష్ట్రంలో అభివృద్ది జరగదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు అవినీతి చేస్తే నిరూపించాలి, లేకపోతే మాట్లాడకూడదని ఆయన ఏపీ సీఎం జగన్ కు సూచించారు. 

శనివారం నాడు అమరావతిలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు.పోలవరంలో మూడువేల కోట్ల రూపాయాల అవినీతి జరిగిందని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

Also Read:AP Capitals : పురందరేశ్వరిని కలిసిన రాజధాని రైతులు

ప్రజా ధుర్వినియోగం చేస్తే సహించేది లేదని కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 151 ఎమ్మెల్యే  సీట్లు ఉన్న జగన్ ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.సీఎం మారినప్పుడల్లా రాజధానిని మార్చడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు.

చంద్రబాబుపై జగన్‌కు కోపం ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలన్నారు.  కానీ, మీ ఇద్దరి మధ్య గొడవలతో ప్రజలను ఇబ్బందులు పెట్టకూడదని జగన్ కు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు.

click me!