మూడు రాజధానులకు వ్యతిరేకం, అభద్రతా భావంలో జగన్: కన్నా కామెంట్స్

By narsimha lodeFirst Published Dec 21, 2019, 6:08 PM IST
Highlights

ఏపీకి మూడు రాజధానులకు తాము వ్యతిరేకమని బీజేపీ తేల్చి చెప్పింది. దీని వల్ల అభివృద్ది జరగదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. 

అమరావతి: రాజధాని మార్పుతో రాష్ట్రంలో అభివృద్ది జరగదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు అవినీతి చేస్తే నిరూపించాలి, లేకపోతే మాట్లాడకూడదని ఆయన ఏపీ సీఎం జగన్ కు సూచించారు. 

శనివారం నాడు అమరావతిలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు.పోలవరంలో మూడువేల కోట్ల రూపాయాల అవినీతి జరిగిందని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

ప్రజా ధుర్వినియోగం చేస్తే సహించేది లేదని కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 151 ఎమ్మెల్యే  సీట్లు ఉన్న జగన్ ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.సీఎం మారినప్పుడల్లా రాజధానిని మార్చడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు.

Also read:జగన్ మూడు రాజదానులు: పవన్ కల్యాణ్, నాగబాబులకు చిరంజీవి షాక్

చంద్రబాబుపై జగన్‌కు కోపం ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలన్నారు.  కానీ, మీ ఇద్దరి మధ్య గొడవలతో ప్రజలను ఇబ్బందులు పెట్టకూడదని జగన్ కు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు.

Alsoread:ఏపీకి మూడు రాజధానులు: పవన్‌కు షాకిచ్చిన చిరు, జగన్ జై

అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఎన్నికల ముందు చెప్పిన వైసీపీ నేతలంతా అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలు దాటినా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగితే చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగకుండా అడ్డుకొన్నదేవరో చెప్పాలని ఆయన కోరారు.

Also read: రాజధానిపై బోస్టన్ కమిటీ మధ్యంతర నివేదిక ఇదీ...

పరిపాలన వికేంద్రీకరణకు తాము వ్యతిరేకిస్తున్నట్టుగా బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.జీఎన్ రావు కమిటీ అందరి అభిప్రాయాలను తీసుకొందా అని ఆయన ప్రశ్నించారు.తాము కోరుకొంది అభివృద్ది వికేంద్రీకరణ తప్ప... అధికార వికేంద్రీకరణకు తాము వ్యతిరేకమన్నారు.

Also read:చిరంజీవితో భేటీ: పవన్ కల్యాణ్ కు వైఎస్ జగన్ చెక్

click me!