శ్రీశైలంలో కుంభకోణాలు: వైసీపీ ప్రభుత్వంపై బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jun 3, 2020, 7:19 PM IST
Highlights

రియల్ ఎస్టేట్ చేసే శిల్పా చక్రపాణి రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చింది ఎవరో గుర్తు చేసుకోవాలన్నారు బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కర్నూలులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రజాక్, రఫీ, శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరులు కాదా అని బైరెడ్డి నిలదీశారు

రియల్ ఎస్టేట్ చేసే శిల్పా చక్రపాణి రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చింది ఎవరో గుర్తు చేసుకోవాలన్నారు బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కర్నూలులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రజాక్, రఫీ, శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరులు కాదా అని బైరెడ్డి నిలదీశారు.

శ్రీశైలం దేవస్థానం అక్రమాలకు రఫీ, రజాక్‌లు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం, మహానంది అక్రమాలను ఖండిస్తూ త్వరలో మహానంది నుంచి శ్రీశైలానికి రథయాత్ర చేస్తానని బైరెడ్డి స్పష్టం చేశారు.

Also Read:శ్రీశైలం ఆలయంలో స్కామ్: పోలీసుల చేతికి చిక్కిన 26 మంది నిందితులు

మహానంది ఆదాయం బాగా తగ్గిందన్న ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హిందూ సంప్రదాయాలను కాపాడాలన్నారు. రాయలసీమలోని దేవుళ్ల సొమ్ము తిన్నోడు ఎవరూ బాగుడలేదని.. శ్రీశైలంలో ఆదాయం పెద్ద ఎత్తున వస్తుందని రాజశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

భక్తుల మనోభావాలను కొందరు రాజకీయ నాయకులు భ్రష్టు పట్టిస్తున్నారని.. అనకొండను వదిలి వాన పామును పట్టుకున్నారని ఆయన ఆరోపించారు. శ్రీశైలంలో పెత్తనం చేసేది అధికార పార్టీకి చెందినవారేనన్న బైరెడ్డి.. మొన్నటి వరకు రఫీ నేడు రజాక్‌ల పెత్తనం వీరికి అండదండలు ప్రతిపక్ష, అధికార పార్టీకి చెందినవారున్నారని ఆయన అన్నారు.

Also Read:సాఫ్ట్‌వేర్ మార్చి శ్రీశైలం దేవాలయంలో కోట్లు స్వాహా: ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న ఈవో

శ్రీశైలంలో కొన్ని కోట్లలో అవినీతి జరిగింది, అవినీతికి పాల్పడ్డ వారు ఎంతటి వారైనా వారిపై చర్యలు తీసుకోవాలని రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీశైలంలో అన్యమత ప్రచారం సాగుతోందని.. హిందూ సమాజంలో ఇటువంటివి జరుగుతుంటే అధికార పార్టీకి చెందిన వ్యక్తులను ప్రోత్సహించడం మంచిదికాదని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలంతో పాటు మహానంది ఆలయంలపై ప్రత్యేకంగా అధికారిని నియమించాలని రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. 

click me!