నీలం సహానీకి ఊరట: మూడు మాసాల పాటు పదవీ కాలం పొడిగింపు

By narsimha lodeFirst Published Jun 3, 2020, 4:19 PM IST
Highlights

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ పదవీ కాలాన్ని మూడు మాసాల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది.


అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ పదవీ కాలాన్ని మూడు మాసాల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది.ఏపీ సీఎస్ నీలం సహాని పదవీ కాలాన్ని మూడు మాసాల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించింది.

దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు సీఎస్ పదవిలో ఆమె కొనసాగుతారు. సహానీ పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖను కోరింది. లాక్ డౌన్ తో పాటు ఇతరత్రా కారణాలను దృష్టిలో పెట్టుకొని సహానీ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరిన విషయం తెలిసిందే.

జూన్ 30వ తేదీతో సీఎస్ గా నీలం సహానీ రిటైర్ కానున్నారు.  సీఎస్‌ పదవీకాలాన్ని పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా చేసుకొని కేంద్రం ఆమెకు మూడు మాసాల పాటు పదవీని పొడిగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ 2019 నవంబర్ 13వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఏపీ రాష్ట్రానికి మొదటి మహిళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రికార్డు సృష్టించారు.సహానీ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ ఈ ఏడాది మే 14వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు సీఎం జగన్

click me!