పక్క రాష్ట్రాలకూ పాకిన జగన్ మానియా....మహారాష్ట్రలో ప్రత్యక్షమైన భారీ ఫ్లెక్సీ

Published : Dec 21, 2019, 05:41 PM ISTUpdated : Dec 21, 2019, 06:17 PM IST
పక్క రాష్ట్రాలకూ పాకిన జగన్ మానియా....మహారాష్ట్రలో ప్రత్యక్షమైన భారీ ఫ్లెక్సీ

సారాంశం

నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు అనేక మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఖ్యాతి తెలుగు రాష్ట్రాలను దాటి పక్క రాష్ట్రాలకు కూడా పాకింది. నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు అనేక మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

also read ఏపీకి మూడు రాజధానులు: పవన్‌కు షాకిచ్చిన చిరు, జగన్ జై

అందుబాటులో ఉన్నవారు స్వయంగా వచ్చి జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతుండగా... దూరంగా ఉన్నవారు ఫ్లెక్సీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ తరం యువత అంతా సోషల్ మీడియాలో తమ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. 

ఆయనపై అభిమానం ఎంతలా ఉందంటే ట్విట్టర్ లో టాప్ ట్రెండ్ ఆయన జన్మదినవేడుకే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ఇప్పుడు మహారాష్ట్రలో మొదలయినట్టున్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని లాతూర్ ప్రాంతంలో జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన భారీ ఫ్లెక్సీ ఒకటి వెలిసింది. 

also read  జగన్ మూడు రాజదానులు: పవన్ కల్యాణ్, నాగబాబులకు చిరంజీవి షాక్

అందులో జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు అని రాసారు. వీరు ఆ ఫ్లెక్సీమీద అంతా మారాఠిలోనే రాయడం విశేషం. కింద తమ ఊరిపేరును రాసిన సదరు అభిమానులు తమను తాము జగన్ ఫాన్స్ క్లబ్ గా పేర్కొనడం కొసమెరుపు.
 

PREV
click me!

Recommended Stories

దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli
రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli