బైబిల్, ఖురాన్, భగవద్గీతలే వైసీపీ మేనిఫెస్టో అన్నారు.. కానీ ఏం చేశారు ? - పురందేశ్వరి

వైసీపీ (YCP) రైతు వ్యతిరేక ప్రభుత్వమని బీజేపీ (BJP) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి (ap bjp chief daggupati purandeswari) అన్నారు. తుఫాన్ తో రైతులు నష్టపోతే వారిని ఆదుకోలేదని ఆరోపించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం (modi government) వరికి 200 శాతం మద్దతు ధర పెంచిందని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుపాటు పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో రైతు గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు ఆమె హాజరై మాట్లాడారు. 

రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీపై కీలక ప్రకటన.. ఒకే విడతలో..

Latest Videos

ఆంధ్రప్రదేశ్ లో రైతుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తొంభై శాతానికి పైగా రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఆరోపించారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో రెండో స్థానంలో ఉందని చెప్పారు. వైసీపీ రైతు పక్షపాతి ప్రభుత్వం అని జగన్ చెప్పుకున్నా.. అది కేవలం మాటలకు పరిమితం అయ్యిందని ఆరోపించారు.

Participated in the Rythu Garjana event at Vijayawada pic.twitter.com/ZAHsrpBSHE

— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP)

రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని పురందేశ్వరి ఆరోపించారు. వ్యవసాయం, ఆక్వా, పాడి పరిశ్రమలో ఉత్పాదన తగ్గిపోయిందని అన్నారు. మరి అలాంటప్పుడు వైసీపీ రైతు ప్రభుత్వం ఎలా అవుతుందో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. బైబిల్, ఖురాన్, భగవద్గీతలే తమ మేనిఫెస్టో అని గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. కానీ అందులో ఉన్న హామీలు అమలు చేయకుండా పవిత్ర గ్రంథాలను అవమానించారని విమర్శించారు.

హర్యానా-పంజాబ్ సరిహద్దులో ఉద్రిక్తత.. రైతులపై బాష్పవాయువు ప్రయోగం.. ఎందుకంటే ?

మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ, నాలుగు వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల కోసం నిధి అని అన్నారని, కానీ అవన్నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్లాయో జగన్ చెప్పాలని పురందేశ్వరి ప్రశ్నించారు. తుఫాన్ లతో నష్టపోయిన రైతులను ఆదుకోలేదని ఆమె ఆరోపించారు. పంట నష్టం పరిశీలనకు వచ్చినా.. పొలాల్లోకి కూడా దిగలేదని విమర్శించారు. అధికారంలో లేనప్పుడు రెండేళ్ల పాటు ఓదార్పు యాత్ర చేశారని, మరి ఇప్పుడు ఎందుకు అదే రైతుల ఇండ్లలోకి వెళ్లడం లేదని ప్రశ్నించారు. 

మద్దతు ధర కోరితే  కనీసం స్పందన లేదని ఆమె ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడం వల్ల నష్టపోయిన వారిని ఆదుకోలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద నిధులు ఇస్తే వాటిని దారి మళ్లించారని తెలిపారు. రైతుల‌ కన్నీరు తుడవాలనే ఆలోచన జగన్ కి లేదని విమర్శించారు. దేశానికి ఆహార భద్రత అందించిన మహానుభావుడు స్వామినాధన్ అని, అలాంటి వారిని మోడీ ప్రభుత్వం గుర్తించి భారతరత్నకు సిఫార్సు చేసిందని తెలిపారు.

ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శిపై కాల్పులు, దారుణ హత్య.. ఓవైసీ ఆగ్రహం..

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వరికి 200 శాతం మద్దతు ధర పెంచిందని అన్నారు. తాను పండించిన పంటను రైతు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశాన్ని మోడీ ప్రభుత్వం కల్పించిందని కొనియాడారు. రైతు కుటుంబానికి సాలీనా యాభై‌వేలు వచ్చే ఏర్పాట్లు చేసిందని తెలిపారు. రైతులకు ఇచ్చే సబ్సిడీ భారం మొత్తం కేంద్రమే భరిస్తుందని అన్నారు. ఇప్పటికైనా రైతులు ఆలోచించాలని, రైతు సంక్షేమానికి పాటుపడేవారికే ఓటు వేయాలని కోరారు.

click me!