నెల్లూరు నుండి నరసరావుపేటకు వెళుతూ... మాజీ మంత్రి అనిల్ ఎమోషనల్ 

By Arun Kumar PFirst Published Feb 13, 2024, 2:58 PM IST
Highlights

మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన అనుచరులు, నెల్లూరు వైసిపి శ్రేణుల ముందు ఎమోషన్ అయ్యారు. నెల్లూరు నుండి నరసరావుపేటకు షిప్ట్ అవుతున్న ఆయన కాస్త బాధను వ్యక్తం చేసారు. 

నెల్లూరు : మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈసారి అసెంబ్లీకి కాకుండా లోక్ సభకు పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయనకు నెల్లూరు నుండి నరసాపురంకు షిప్ట్ చేసింది వైసిపి అధిష్టానం. ఇలా ఇంతకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన నెల్లూరు ప్రాంతానికి రాజకీయంగా దూరం అవుతుండటంతో అనిల్ కాస్త ఎమోషనల్ అయ్యారు. నెల్లూరు సిటీ వైసిపి నేతలతో సమావేశమైన అనిల్ వారికి ధన్యవాదాలు తెలిపారు.  

2009 నుంచి మూడుసార్లు నెల్లూరు నుంచి పోటీ చేశానని... మొదటిసారి ఓడినా రెండుసార్లు విజయం సాధించానని అనిల్ యాదవ్ అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నానని అన్నారు. తన కష్టకాలంలో అండగా నిలిచినవారి రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేనని అన్నారు. తనకు సహకరించినట్లుగా రాబోయే ఎన్నికల్లోనూ వైసిపి అభ్యర్థి  ఖలీల్ ను గెలిపించాలని అనిల్ కోరారు. 

Latest Videos

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం ఓ సైనికుడిలా పని చేస్తానని... ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడికి వెళతానని అన్నారు. అధినేత నిర్ణయానికి కట్టుబడే నెల్లూరును వదిలి నరసరావుపేటకు వెళుతున్నట్లు అనిల్ తెలిపారు. అక్కడ కూడా అందరిని కలుపుకుపోతూ వైసిపిని గెలిపించుకుంటానని అన్నారు. 
నరసరావుపేట లోక్ సభ పరిధిలోని ఎమ్మెల్యేలందరితో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని... అంతా కలిసికట్టుగా పనిచేస్తామని అనిల్ తెలిపారు. 

నెల్లూరు ప్రాంతం తనకు అన్నీ ఇచ్చింది... ఈ ప్రాంతానికి సేవ చేసుకునే అవకాశం కూడా తనకు వచ్చిందన్నారు. అందరి దీవెనలతో నరసరావుపేటలో కూడా  రాణిస్తానని అన్నారు. కొందరు తనకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని...  అయినా అవేవీ పట్టించుకోవడం లేదన్నారు.

Also Read  కేశినేని నాని ఓ అప్పుల అప్పారావు, మరో బిల్డప్ బాబాయ్..: బోండా ఉమ

నెల్లూరు వదిలి వెళుతున్నందుకు బాధగా ఉన్నా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అనిల్ పేర్కొన్నారు. ఎంపీగా పోటీ చేయమని సీఎం జగన్ చెప్పారు... ఆయన ఎలా చెబితే అలా చేస్తానన్నారు. ఇక  నరసరావుపేట రాజకీయాలు చూసుకుంటానని... రేపు(బుధవారం) సాయంత్రం అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటానని అనిల్ యాదవ్ తెలిసారు.

ఇక వైసిపి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వ్యాఖ్యలు తనను బాధించాయని అనిల్ యాదవ్ అన్నారు. నాలుగున్నరేళ్ళు జగన్ దేవుడిలా కనిపించారు... ఆయన ఇచ్చిన పదవులు అనుభవించారు... ఇప్పుడేమో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2014 లో టికెట్ ఇచ్చి... ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది... ఇంకా ఏం చేయాలో కృష్ణమూర్తి చెప్పాలని అనిల్ నిలదీసారు. 

click me!