జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బీజేపీ ఏపీ చీఫ్ సోమువీర్రాజు ఫోన్ చేశారు.విశాఖలో చోటు చేసుకున్న ఘటనలతో పాటు పోలీసుల నోటీసులపై సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ తో చర్చించారు.
అమరావతి:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ఆదివారంనాడు ఫోన్ చేశారు.విశాఖపట్టణంలో పవన్ కళ్యాణ్ కు పోలీసులు ఇచ్చారు. ఎలాంటి అనుమతి లేకుండా విశాఖలో కార్యక్రమాలు నిర్వహించవద్దని పోలీసులు పవన్ కళ్యాణ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయమై సోము వీర్రాజు ఫోన్ లో మాట్లాడారు. పోలీసులిచ్చిన నోటీసులో ప్రస్తావించిన అంశాల గురించి సోము వీర్రాజు అడిగి తెలుసుకున్నారు.నిన్న విశాఖపట్టణంలో ఏం జరిగిందనే విషయమై కూడా పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు చర్చించారు.జనసేనపై ఏపీ మంత్రులు పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలపై బీజేపీ మండిపడింది. ఇవాళ విజయవాడలో జరిగిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో విశాఖలో జరిగిన ఘటనలపై బీజేపీ నాయకులు చర్చించారు.ఏపీ ప్రభుత్వం తీరును ఈ సమావేశం ఎండగట్టింది. విశాఖకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారనే సమాచారం.అయితే ఈ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మూడు రాజధానులకు మద్దతుగా నిన్న విశాఖపట్టణంలో విశాఖగర్జన నిర్వహించారు. మరోవైపు ఉత్తరాంధ్రలో మూడు రోజులపాటు పర్యటనకు పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం విశాఖకు వచ్చారు.విశాఖ గర్జనకు వచ్చే మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు దాడికి దిగారని వైసీపీ ఆరోపించింది. అయితే ఈ దాడితో తమకు సంబంధం లేదని జనసేన ప్రకటించింది. వైసీపీ నేతలే దాడులు చేసి తమపై ఆరోపణలు చేస్తున్నారని జనసేన విమర్శలు చేసింది.
ఏపీలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. మూడు రాజధానులను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతున్నాయి. అభివృద్ది ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే మూడు రాజధానులను అంశాన్ని తీసుకువచ్చినట్టుగా వైసీపీ చెబుతుంది.