అది గర్జన కాదు... కబ్జాకోరుల గారడీ, వరుణ దేవుడూ సహకరించలేదు : అయ్యన్నపాత్రుడు

Siva Kodati |  
Published : Oct 16, 2022, 04:33 PM IST
అది గర్జన కాదు... కబ్జాకోరుల గారడీ, వరుణ దేవుడూ సహకరించలేదు : అయ్యన్నపాత్రుడు

సారాంశం

నిన్న విశాఖలో జరిగింది గర్జన కాదు... కబ్జాకోరుల గారడీ అంటూ సెటైర్లు వేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. విశాఖపై మొసలి కన్నీరు కారిస్తే మోసపోవడానికి ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులేం కాదని అయ్యన్న స్పష్టం చేశారు. 

మూడు రాజధానులకు మద్ధతుగా నిన్న విశాఖలో జరిగిన విశాఖ గర్జన కార్యక్రమంపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. అది గర్జన కాదు... కబ్జాకోరుల గారడీ అంటూ ఆయన సెటైర్లు వేశారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి గర్జన జరిపినప్పటికీ.. అది అట్టర్ ఫ్లాప్ అయ్యిందని అయ్యన్నపాత్రుడు చురకలు వేశారు. అధర్మానికి 18 అక్షౌహిణుల బలం వున్నా.. 6 అక్షౌహిణులే వున్న ధర్మం ముందు ఓడిపోయిందని ఆయన గుర్తుచేశారు. అధికార పార్టీ కుట్రలపై వరుణ దేవుడు కూడా నీళ్లు చల్లాడంటూ అయ్యన్న తెలిపారు. మూడు ముక్కలాట ఉత్తరాంధ్ర ప్రజల మనస్సులోంచి వచ్చింది కాదని... దోపిడీలు, దౌర్జన్యాల నుంచి జనం దృష్టి మళ్లించేందుకు జగన్ చేసిన కుట్ర అని ఆయన ఆరోపించారు. 

రోల్డ్ గోల్డ్‌ను గోల్డ్ గాను.. గోల్డ్‌ను రోల్డ్ గోల్డ్ గాను మాయ చేశారంటూ అయ్యన్న సెటైర్లు వేశారు. మూడున్నర సంవత్సరాల్లో విశాఖ అభివృద్దికి జగన్ చేసిందేమీ లేదన్నారు. విశాఖపై మొసలి కన్నీరు కారిస్తే మోసపోవడానికి ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులేం కాదని అయ్యన్న స్పష్టం చేశారు. నిన్నట విశాఖ గర్జనకు విజయసాయిరెడ్డి ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసే అధికారం జగన్‌కు లేదని.. హైకోర్టు, సుప్రీంకోర్ట్ ఇప్పటికే తేల్చిచెప్పాయని అయ్యన్నపాత్రుడు గుర్తుచేశారు. ఈ విషయం తెలిసినా ప్రాంతీయ, కుల విద్వేషాలు రగిల్చి ఉత్తరాంధ్రను దోచుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ALso Read:జగన్‌ ఏ1 అయితే ధర్మాన ఏ5 .. ఇప్పుడేమో నీతిమంతుడిలా మాటలు : టీడీపీ నేత నక్కా ఆనందబాబు

ఇకపోతే.. మూడు రాజధానుల వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము, తమ బినామీలు కొట్టేసిన ఆస్తుల్ని కాపాడుకోవడానికే ధర్మన ప్రసాదరావు, ఉత్తరాంధ్రకు చెందిన ఇతర మంత్రులు, ఆ ప్రాంత వాసుల్ని రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. అందుకే వీరంతా జగన్ మూడు ముక్కలాటకు మద్ధతుగా నిలుస్తున్నారని నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. ధర్మాన ప్రసాదరావు వైసీపీలో వుండి ఉత్తరాంధ్రకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌లలో ధర్మాన ఏ5గా వున్నారని నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. జగన్‌తో సహా ముద్దాయిగా వున్న ధర్మాన నీతిమంతుడిలా మాట్లాడుతున్నారంటూ ఆయన సెటైర్లు వేశారు. 

67 కంపెనీలకు అధిపతిగా వున్న జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని... వ్యాపారవేత్త ప్రజాసేవ చేస్తాడా అని ఇదే అసెంబ్లీలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడలేదా అని నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. మాజీ సైనికోద్యోగుల భూముల్ని కబ్జా చేసిన ధర్మాన ప్రసాదరావు.. వాటిని కాపాడుకోవడానికే విశాఖలో రాజధాని అంటున్నారని మండిపడ్డారు. ధర్మాన నేతృత్వంలో జరిగిన భూదోపిడిని సిట్ విభాగం కూడా తప్పుపట్టిందని నక్కా ఆనందబాబు గుర్తుచేశారు. మరిన్ని భూములను కొట్టేసేందుకే ఇప్పుడు ధర్మాన స్కెచ్ వేశారని ఆయన ఆరోపించారు. మరోసారి మంత్రిగా అవకాశం దక్కించుకోవాలని, తన కొడుకుని ఎంపీని చేయాలని ధర్మాన ప్రసాదరావు తాపత్రయపడుతున్నారని ఆనందబాబు ఆరోపించారు. విశాఖవాసులు వైసీపీని పట్టించుకోవడం లేదని... గతంలో తన తల్లిని ఓడించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని జగన్ భావిస్తున్నారని నక్కా ఆరోపించారు. ఉత్తరాంధ్ర వాసులు ఎట్టి పరిస్ధితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని నమ్మే పరిస్ధితి లేదన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్