టీటీడీ ఆస్తుల విక్రయం: 26న ఆందోళనలకు బీజేపీ పిలుపు

By narsimha lodeFirst Published May 24, 2020, 12:06 PM IST
Highlights

 టీటీడీ ఆస్తుల విక్రయాన్ని నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన ధర్నా చేయనున్నట్టుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. టీటీడీకి చెందిన నిరర్ధక ఆస్తులను విక్రయించాలని తిరుమల తిరుపతి పాలకమండలి నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.

అమరావతి: టీటీడీ ఆస్తుల విక్రయాన్ని నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన ధర్నా చేయనున్నట్టుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. టీటీడీకి చెందిన నిరర్ధక ఆస్తులను విక్రయించాలని తిరుమల తిరుపతి పాలకమండలి నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.

ఆదివారం నాడు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఆస్తులను విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అని ఆయన అన్నారు. ఎందరో భక్తులు టీటీడీకి విరాళంగా భూములు ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఏడాది లోపుగా జగన్ సర్కార్ అన్ని ధరలను పెంచిందన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. ఆదాయం కోసం ప్రభుత్వ భూములను కూడ విక్రయిస్తున్నారని చెప్పారు.

also read:సగం ధరకే తిరుపతి లడ్డు: 25 నుండి ఏపీలోని అన్ని జిల్లాల్లో విక్రయాలు

చంద్రబాబు సర్కార్ అమలు చేసిన విధానాలను వైసీపీ ప్రభుత్వం కూడ అమలు చేస్తోందని ఆయన విమర్శించారు. టీడీపీ చేపట్టిన ప్రాజెక్టు టెండర్లపై రివర్స్ టెండర్లు చేపట్టిన జగన్ సర్కార్ టీటీడీ ఆస్తుల విషయంలో ఎందుకు ఆ విధానాన్ని పాటించడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

టీడీపీ ప్రభుత్వం  ప్రజలకు సరైన మేలు చేసే పనులు చేయకపోవడంతో ప్రజలు ఆ పార్టీని ఓడించారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ చేసిన తప్పులనే జగన్ ప్రభుత్వం కూడ చేస్తోందని ఆయన ఆరోపించారు.

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళనలు ఎలా నిర్వహించామో టీటీడీ ఆస్తుల విక్రయాన్ని నిరసిస్తూ ఆందోళనలు  చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

also read:శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన జగన్ సర్కార్, ప్రతిపక్షాల విమర్శలు

తమిళనాడు రాష్ట్రంలోని టీటీడీ ఆస్తులను విక్రయించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది. 2014-15 నుండి తమిళనాడు రాష్ట్రంలో టీటీడీకి చెందిన ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ పాలక మండలి ప్రయత్నిస్తోంది. ఇది కొత్త నిర్ణయం కాదు, గత పాలక మండలి తీసుకొన్న నిర్ణయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము ఆమోదించినట్టుగా టీటీడీ బోర్డు పునరుద్ఘాటించింది.

click me!