వైసిపి భూమన కరుణాకర్ రెడ్డి వెరైటీ నిరసన

First Published Apr 25, 2018, 5:11 PM IST
Highlights

ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో వినూత్నమైన నిరసన కార్యక్రమానికి భూమన కరుణాకర్ రెడ్డి తెర తీశారు.

నిరసన కార్యక్రమంలో వెరైటీ ఉండాలనుకన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. అందుకే ఆయన సరికొత్త పద్ధతిలో దీక్షకు దిగరు. ఇంతకూ ఆయన అంతగా చేసిన వెరైటీ నిరసన ఏందబ్బా అనుకుంటున్నారా? అయితే చదవండి.

ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో వినూత్నమైన నిరసన కార్యక్రమానికి భూమన కరుణాకర్ రెడ్డి తెర తీశారు. ఆయన, ఆయన అనుచరులు తిరుపతిలోని గాంధీ విగ్రహం ఎదురుగా మంగళవారం మండుటెండ్లలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తక్షణమే ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని భూమన, వైసిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. భగ భగమండే ఎండలో దీక్షకు దిగడం తిరుపతిలోనే కాదు ఎపి అంతటా చర్చనీయాంశమైంది.

ఈ దీక్షలో భూమన మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు మీద నిప్పులు కురిపించారు. వందల ఎసిల మధ్య చంద్రబాబు తన బర్త్ డే రోజు నిరహార దీక్ష చేశారని ఆరోపించారు. కానీ వైసిపి అధినేత జగన్ మాత్రం మండుటెండల్లో పాదయాత్ర చేపడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రకటనలు ఆశ్చర్యకరంగా ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. ఆయన మీద కుట్ర జరుగుతుందట.. ఆయనను ప్రజలే కాకపాడాలట.. ఈ మాటలో ఏమైనా అర్థం ఉందా అని భూమన ప్రశ్నించారు. ఐదు కోట్ల మందిని కాపాడాల్సిన వ్యక్తి అలా మాట్లాడడం సరికాదన్నారు.

చంద్రబాబు ఎసి లో దీక్ష చేస్తే మేము ప్రత్యేక హోదా కోసం మండుటెండలో దీక్ష చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబును జైలుకు పంపుతారన్న భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. నాలుగేళ్లు ప్రత్యేక హోదాపై బాబు ఎందుకు సైలెంట్ అయ్యారో చెప్పాలన్నారు. జగన్ పోరాటం వల్లే హోదాపై జనాల్లో ధీమా పెరిగిందన్నారు. అందుకోసమే బాబు హోదా విషయంలో మళ్లీ యూ టర్నర్ తీసుకున్నారని విమర్శించారు. తిరుపతిలో చంద్రబాబు తలపెట్టిన సభ దగాకోరు సభ అని భూమన ఎద్దేవా చేశారు.

click me!