చంద్రబాబు సర్కార్ డేటా చోరీ: పెగాసెస్ పై మధ్యంతర నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన భూమన

By narsimha lode  |  First Published Sep 20, 2022, 12:10 PM IST

చంద్రబాబు సర్కార్ రాష్ట్రప్రజల డేటా చౌర్యం చేసిందని పెగాసెస్ పై ఏర్పాటు చేసిన శాసనసభ సంఘం అభిప్రాయపడింది.ఈ మేరకు మధ్యంతర నివేదికను హౌస్ కమిటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.


 అమరావతి: చంద్రబాబు ప్రభుత్వహయంలో డేటా చోరీ జరిగిందని  పెగాసెస్ పై ఏర్పాటు చేసిన  హౌస్ కమిటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. మంగళవారం నాడు  ఏపీ అసెంబ్లీలో మధ్యంతర నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.  చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో డేటా చౌర్యం జరిగిందన్నారు. పలు శాఖలకు చెందిన అధికారులతో నాలుగు దఫాలు సమావేశమై సమయంలో ఈ విషయాన్ని గుర్తించామన్నారు. డేటా చౌర్యానికి సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రభుత్వానికి చెందిన డేటా సెంటర్ లో ఉండాల్సిందన్నారు. కానీ ఈ సమాచారం టీడీపీ సేవామిత్ర అనే యాప్ తో డేటా చోరీ జరిగిందని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఓటర్లను రద్దు చేసే ప్రయత్నంలో భాగంగానే  డేటా చోరీ జరిగిందని కమిటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.  చంద్రబాబు సర్కార్ 2016 నుండి 2019 మే30 వరకు   స్టేట్ డేటా సెంటర్ లోని సమాచారాన్ని  టీడీపీ వ్యక్తులకు పంపడంపై  హౌస్ కమిటీ చర్చించిందని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. 

Latest Videos

undefined

త్వరలోనే  పూర్తి నివేదికను సభకు సమర్పిస్తామన్నారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ప్రజల డేటాను  సేవా మిత్రా యాప్     నిర్వహిస్తున్న వారికి చేరిందని ఆయన తెలిపారు.  టీడీపీకి ఓటు వేయని వారిని గుర్తించి ఓటరు జాబితాలో వారి పేర్లను తొలగించే ప్రయత్నం చేశారని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఇప్పటికీ నాలుగు సమావేశాలు నిర్వహించి డేటా చౌర్యం జరిగిందని నిర్ధారించామని ఆయన తెలిపారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన సమాచారాన్ని బయటకు ఇచ్చారని తమ విచారణలో తేలిందన్నారు. 

ఇదిలా ఉంటే  తమకు రిపోర్టు ఇవ్వకుండానే సభలో ఇచ్చినట్టు ఎలా చెపుతారంటూ  టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. అయితే సభలో రిపోర్టు ప్రవేశ  పెట్టినా చూడకుండానే టీడీపీ సభ్యులు ఆందోళన చేయడాన్ని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు. 

also read:రేపు ఏపీ అసెంబ్లీ ముందుకు డేటా చౌర్యం నివేదిక.. 85 పేజీలతో రిపోర్టు సిద్దం చేసిన భూమన నేతృత్వంలోని కమిటీ..

ఈ ఏడాది మార్చి మాసంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలపై పెగాసెస్ పై చర్చించారు. దీనిపై సభాసంఘం ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. సభ్యుల వినతి మేరకు హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. 

click me!