ఇంటిముందునుంచి వెడుతుంటే.. దొంగలనుకుని.. కుక్కలతో కరిపించి, దాడి చేసి...

Published : Sep 20, 2022, 11:21 AM IST
ఇంటిముందునుంచి వెడుతుంటే.. దొంగలనుకుని.. కుక్కలతో కరిపించి, దాడి చేసి...

సారాంశం

దొంగలు అని అనుమానించి.. ఇంటిముందునుంచి వెడుతున్న ఇద్దరిని ఓ వ్యక్తి కుక్కతో కరిపించి. విచక్షణారహితంగా దాడి చేశాడు. 

నెల్లూరు :  ఇంటి ముందునుంచి వెళ్తున్న ఇద్దరిని చూసి యజమాని వారిని దొంగలుగా అనుమానించాడు. తన పెంపుడు కుక్కను వారి మీదికి ఉసిగొల్పాడు. ఒకరిని విచక్షణారహితంగా కొట్టాడు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శుక్రవారం రాత్రి రమేష్ ఇంటిముందు నుంచి ఇద్దరు వెళ్తున్నారు. వారిని చూసి దొంగలు అని అనుమానించాడు రమేష్.  

వారి మీద తన పెంపుడు కుక్కను ఉసిగొలిపాడు. కుక్కకు భయపడి ఒకరు పారిపోయారు. రెండో వ్యక్తిని కుక్క కరిచింది.  కిందపడిన ఆ వ్యక్తిని రమేష్ విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా కుక్క చేత మళ్లీ కరిపించాడు. ఆ వ్యక్తిని స్థానిక దేవస్థానం ప్రాంగణంలోకి తీసుకు వెళ్లి గొలుసులతో కట్టేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వీర ప్రతాప్ తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?