ఇష్టారాజ్యంగా ఎర్రమట్టి తవ్వకాలు.. వైసీపీ నేతల ఇళ్ల వద్దే సీజ్ చేసిన వాహనాలు: భూమా అఖిలప్రియ

By Siva KodatiFirst Published Aug 1, 2021, 3:14 PM IST
Highlights

ఆళ్లగడ్డలో యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆరోపించారు టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. నర్సాపురం, కృష్ణాపురంలో ఎస్సీల పేరుతో వైసీపీ నేతలు అక్రమాలు చేస్తున్నారని అన్నారు.

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. ఆదివారం ఆళ్లగడ్డలో ఎర్రమట్టి తవ్వకాల వ్యవహారంపై ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ.. ఆళ్లగడ్డలో యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆరోపించారు. నర్సాపురం, కృష్ణాపురంలో ఎస్సీల పేరుతో వైసీపీ నేతలు అక్రమాలు చేస్తున్నారని అన్నారు. సీజ్ చేసిన వాహనాలు వైసీపీ నేతల ఇళ్ల వద్ద ఉంటున్నాయని అఖిలప్రియ ఆరోపించారు.  వైసీపీ నేతలకే తవ్వకాల అనుమతులు ఇస్తున్నారని ఆమె విమర్శించారు. వారం రోజుల్లో అక్రమ తవ్వకాలు ఆగకపోతే తామే అడ్డుకుంటామని అఖిలప్రియ హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఈ అక్రమాల్లో భాగం ఉందని ఆమె ఆరోపించారు

Also Read:కొండపల్లిలో అక్రమాలు జరగకుంటే.. దేవినేని పర్యటనపై అభ్యంతరమెందుకు: ప్రత్తిపాటి పుల్లారావు
 

click me!