బీర్ ప్రియులకు శుభవార్త

First Published Jul 12, 2017, 6:37 PM IST
Highlights
  • చల్లటి నీళ్ళలో బీరు పౌడర్ను కలుపుకుంటే ఎంచక్కా బీర్ తయారైపోయినట్లే.
  • నిజంగా అంతే. ఎంతినీళ్ళకు ఎంత పౌడర్ కలపాలన్నది సాచెట్ పైనే రాసుంటుంది లేండి.  
  • కాకపోతే బాగా స్ట్రాంగ్ గా కావాలంటే ఒకటకి రెండు సాచెట్లు కలుపుకుంటే చాలు ఇక స్వర్గానికి బెత్తెడు దూరంలో నిలవటం ఖాయం. ఏమంటారు.

మద్యం ప్రియులకు శుభవార్తం. బీరును కింగ్ ఫిషర్ కంపెనీ పౌడర్ రూపంలో కూడా తీసుకొచ్చింది. దానివల్ల బీరు ప్రియులకు ఎంత సౌలభ్యమో కదా? పెద్ద బాటిళ్ళను మోసుకుని వెళ్ళటం, లేదా ఫ్రిజుల్లో పెట్టుకోవాలంటే స్ధలమంతా బాటిళ్ళకే సరిపోతుంది. లేదూ కారులో వెళుతూ బీర్లు తాగాలనుకుంటే పెద్ద సీసాలను తీసుకెళ్ళాలంటే ఎంత కష్టమో. ఇటువంటి అవస్తుల గురించి ఆలోచించే కింగ్ ఫిషర్ సంస్ధ బీరును పౌడర్ రూపంలో తీసుకొచ్చింది. 

 

చల్లటి నీళ్ళలో బీరు పౌడర్ను కలుపుకుంటే ఎంచక్కా బీర్ తయారైపోయినట్లే. నిజంగా అంతే. ఎంతినీళ్ళకు ఎంత పౌడర్ కలపాలన్నది సాచెట్ పైనే రాసుంటుంది లేండి.  కాకపోతే బాగా స్ట్రాంగ్ గా కావాలంటే ఒకటకి రెండు సాచెట్లు కలుపుకుంటే చాలు ఇక స్వర్గానికి బెత్తెడు దూరంలో నిలవటం ఖాయం. ఏమంటారు. త్వరలో సాచెట్లు మార్కెట్లను ముంచెత్తబోతున్నాయ్.

click me!