చంద్రబాబు ఆశలపై వెంకయ్య నీళ్ళు

Published : Jul 12, 2017, 01:02 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
చంద్రబాబు ఆశలపై వెంకయ్య నీళ్ళు

సారాంశం

సీట్ల పెంపు అంశం తన చేతుల్లో లేదన్న విషయాన్ని కూడా వెంకయ్య స్పష్టం చేయటం గమనార్హం. అంటే వెంకయ్య మాటలు వింటూంటే, ఈ సమావేశాల్లోనే సీట్ల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకుందని చంద్రబాబు చెబుతున్నదాంట్లో వాస్తవం లేదని తేలిపోతోంది.  సీట్లు పెరగకపోతే చంద్రబాబుకు పై నియోజకవర్గాల్లో చుక్కలు కనబడటం ఖాయం.

అసెంబ్లీ సీట్ల పెంపుపై చంద్రబాబునాయుడు ఆశలపై వెంకయ్యనాయుడే స్వయంగా నీళ్ళు చల్లారు. త్వరలో మొదలవ్వనున్న పార్లమెంట్ వర్షాకల సమావేశాల్లోనే అసెంబ్లీ సీట్ల పెంపుపై బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం నుండి తనకు సమాచారం ఉందని చంద్రబాబు టిడిపి పార్లమెంటు సభ్యుల సమావేశంలో చెప్పిన సంగతి గుర్తిందికదా? కాబట్టి బిల్లును త్వరగా ప్రవేశపెట్టే విషయమై కేంద్రమంత్రులపై ఒత్తిడి తేవాలంటూ ఎంపిలను చంద్రబాబు ఆదేశించారు. అయితే, చంద్రబాబు మాటలకు పూర్తి విరుద్ధంగా పెద్దన్న వెంకయ్యనాయుడు మాట్లాడటం గమనార్హం.

 

న్యూఢిల్లిలో  వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సీట్ల పెంపు ఎప్పుడు పెరుగుతుందో తాను స్పష్టంగా చెప్పలేనన్నారు. చంద్రబాబుకు ఢిల్లీలో ఏ పని కావాలన్నా వెంకయ్య ద్వారానే సాధించుకునే వారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే, ఢిల్లీలో చంద్రబాబు బలం వెంకయ్యే. సరే, కారణాలేవైనా కానీండి ఈమధ్య గతంలో ఉన్నట్లుగా చంద్రబాబుకు వెంకయ్య మద్దతుగా నిలవలేకపోతున్నారు.

 

రాష్ట్ర విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల పెంపుకు హామీ అయితే ఉంది కానీ ఎప్పటిలోగా పెంచాలనే విషయంలో స్పష్టత లేదన్నారు. సీట్ల పెంపు విషయంలో తాను ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, హోశాంఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో కూడా చర్చించిన విషయాన్ని వెంకయ్య తెలిపారు. సీట్ల పెరగాలని తాను కూడా ఆశిస్తున్నానట్లు పేర్కొన్నారు. సీట్ల పెంపు అంశం తన చేతుల్లో లేదన్న విషయాన్ని కూడా వెంకయ్య స్పష్టం చేయటం గమనార్హం. అంటే వెంకయ్య మాటలు వింటూంటే, ఈ సమావేశాల్లోనే సీట్ల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకుందని చంద్రబాబు చెబుతున్నదాంట్లో వాస్తవం లేదని తేలిపోతోంది.

 

చంద్రబాబు మాటలకు వెంకయ్య మాటలకు పూర్తి విరుద్ధంగా ఉన్న విషయం గమనార్హం. సీట్ల పెంపు అన్నది చంద్రబాబుకు చాలా అవసరం. చంద్రబాబు ఆశిస్తున్నట్లు సీట్లు పెరగకపోతే మాత్రం కష్టాలను ఊహించలేం. ఎందుకంటే, వైసీపీ నుండి 21 మంది ఎంఎల్ఏలను చంద్రబాబు టిడిపిలోకి లాక్కున్నారు. ఆ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఇప్పటి నుండే ఫిరాయింపు ఎంఎల్ఏలకు, పార్టీలోని సీనియర్ నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సీట్లు పెరుగుతాయని కాబట్టి అందరికీ టిక్కెట్లిస్తానంటూ చంద్రబాబు అందరినీ జో కొడుతున్నారు. అలాకాకుండా సీట్లు పెరగకపోతే చంద్రబాబుకు పై నియోజకవర్గాల్లో చుక్కలు కనబడటం ఖాయం.

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna Reddy: కావాలని సంక్షోభాన్ని సృష్టించారు కూటమి పై సజ్జల కామెంట్స్| Asianet Telugu
Perni Nani Comments: బుడబుక్కల ఎమ్మెల్యేలు వెంట్రుకతో సమానం: పేర్ని నాని | Asianet News Telugu