అవినీతి నిరోధక శాఖ వలలో డిప్యూటీ డైరెక్టర్.. క్లర్క్ గా చేరి.. కోట్లు సంపాదించి.. చివరకు అరెస్టై...

By SumaBala BukkaFirst Published Jan 5, 2023, 9:35 AM IST
Highlights

తిరుపతిలో ఓ అవినీతి తిమింగళాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. కోట్ల రూపాయల అక్రమాస్తులను స్వాధీనం చేసుకున్నారు. 

తిరుపతి : తిరుపతిలో అవినీతి నిరోధక శాఖకు ఓ డిప్యూటీ డైరెక్టర్ దొరికాడు. తిరుపతి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఆర్. యుగంధర్ ను అవినీతి నిరోధక శాఖ పట్టుకుంది. ఈ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న ఆర్ యుగంధర్ ఇంట్లో, ఆయన బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఆదాయానికి మించి ఆస్తులను, అక్రమాస్తులను అవినీతి నిరోధక శాఖ గుర్తించింది.  బుధవారం తిరుపతి డిఎస్ పి జనార్దన్ నాయుడు, అనంతపురం ఇన్చార్జి డిఎస్పి జె.శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో అనీషా బృందాలు ఏక కాలంలో యుగంధర్, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు.

ఈ సోదాల్లో  యుగంధర్ పేరిట రూ. 2.72కోట్ల ఆస్తులు ఉన్నట్లు తేలింది. దీంట్లో రూ.1.84కోట్ల విలువైన ఆస్తులు అక్రమాస్తులుగా అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ఈ సోదాల్లో  మూడున్నర కిలోల వెండి వస్తువులు, 850 గ్రాముల బంగారు నగలు.. మరి కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదరుల మీద డీఎస్పీ శివ నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. యుగంధర్ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయని తెలిపారు.

ఇలాంటి జీవో ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా?.. ఆ విషయంలో పోలీసులు వివరణ ఇవ్వాలి: పవన్ బహిరంగ లేఖ

అతనికి కాకినాడలో రెండు ఇళ్లు ఉన్నాయని.. అవి జీ ప్లస్ టు ఇళ్లని తెలిపాడు. ఒక ప్లాటు, ఆరు ఇళ్ల స్థలాలు ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. దీనితోపాటు విజయవాడలో ఒక ఇంటి స్థలం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా చెల్లూరు గ్రామంలో 1.94 సెంట్ల మాగాణి, కాకినాడ మాధవపట్నం గ్రామంలో 0.54 ఎకరాల మాగాణి భూమి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. 

ఆర్. యుగంధర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామ నివాసి. 1999లో క్లర్క్గా  క్లర్క్ గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. ఆ తరువాతి కాలంలో ప్రమోషన్లు పొందుతూ.. ప్రస్తుతం తిరుపతి జిల్లా వెనుకబడిన తరగతుల  సంక్షేమ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. 

click me!