టీడీపీ నేత కొల్లు రవీంద్ర హౌస్ అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత..

By Sumanth KanukulaFirst Published Jun 1, 2023, 5:15 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ  నేత కొల్లు రవీంద్రను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయం తెలుసుకుని ఆయన నివాసం వద్దకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

మచిలీపట్నం: తెలుగుదేశం పార్టీ  నేత కొల్లు రవీంద్రను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయం తెలుసుకుని ఆయన నివాసం వద్దకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాలు.. మూడు రోజుల క్రితం ఇంగ్లీష్‌పాలెంలో టీడీపీ కార్యకర్తలపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే వైసీపీ కార్యకర్తలే ఈ దాడి చేశారని ఆరోపిస్తున్న టీడీపీ.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతుకుంది. 

ఈ క్రమంలోనే టీడీపీ  శ్రేణులపై దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలని చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించేందుకు కొల్లు రవీంద్ర సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కూడా అక్కడ ఆందోళన నిర్వహించాలని చూశారు. అయితే ఈ నేపథ్యంలోనే కొల్లు రవీంద్ర ఇంటికి చేరుకున్నారు. ఆయన బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఆయనతో చర్చలు జరిపారు. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. 

ఇక, వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందని కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మర్గానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు ఇప్పటికైనా మారాలని అన్నారు. టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బందరులో అరాచకాలు ఆపకపోతే రేపు అమరణదీక్షకు దిగుతానని హెచ్చరించారు. 

click me!