కర్ణాటక రాష్ట్రంలోన బెంగుళూరులో పట్టుబడిన డ్రగ్స్ కు ఏపీ రాష్ట్రంతో లింక్స్ లభ్యమయ్యాయి. తప్పుడు ఆధార్ కార్డు ఆధారంగా అస్ట్రేలియాకు డ్రగ్స్ తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
బెంగుళూరు: Karnataka రాష్ట్రంలో ఆదివారం నాడు భారీగా Drugs పట్టుబడింది.ఈ డ్రగ్స్ తో Andhra Pradesh రాష్ట్రానికి లింక్స్ ఉన్నట్టుగా Customs అధికారులు గుర్తించారు. Bangloreలో అంతర్జాతీయ కార్గోలో రూ.90 లక్షల విలువైన ఐదు కిలోల డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. రెడీమెడ్ దుస్తుల చాటున డ్రగ్స్ ను Australia కు తరలిస్తున్నట్టుగా కస్టమ్స్ అధికారులు తెలిపారు. బెంగుళూరులో పట్టుబడిన డ్రగ్స్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు లింకులున్నట్టుగా అధికారులు గుర్తించారు. చెన్నైలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ లోని Guntur కు చెందిన ఓ వ్యక్తి Aadhar Card ఫోటోను మార్పింగ్ చేసి డ్రగ్స్ ను అస్ట్రేలియాకు తరలించేందుకు ప్రయత్నించినట్టుగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. Vijayawada లోని కొరియర్ ఏజన్సీని సంప్రదించిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
also read:విజయవాడ డ్రగ్స్ కేసు: డీటీఎస్ కొరియర్ సంస్థలో మరో ముగ్గురు అరెస్ట్
undefined
ఇప్పటికే విజయవాడలోని DTS కొరియర్ సంస్థ నుండి అస్ట్రేలియాకు డ్రగ్స్ సరపరా చేసిన విషయాన్ని ఇటీవలనే అధికారులు గుర్తించారు,. నకిలీ ఆధార్ కార్డు ద్వారా అస్ట్రేలియాకు పచ్చళ్ల పేరుతో డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నించారు.ఈ కేసులో ఇప్పటికే ఏడుగురికి పైగా అరెస్ట్ చేశారు. విజయవాడలోని డీటీఎస్ కొరియర్ సంస్థ నుండి డ్రగ్స్ ను విదేశాలను తరలించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఈ నెల 20న హైద్రాబాద్ కు చెందిన డీటీఎస్ కొరియర్ సంస్థకు చెందిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు
పచ్చళ్ల పేరుతో అస్ట్రేలియా కు కొరియర్ పంపారు. అయితే పచ్చళ్ల పేరుతో పంపిన కొరియర్ ద్వారా డ్రగ్స్ పంపుతున్నారని పోలీసులు గుర్తించారు. ఈ విషయమై ఎన్ సీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నెల 1వ తేదీన విజయవాడలోని డ్రగ్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.
ఈ కొరియర్ ను పంపిన వ్యక్తి ఆధార్ కార్డు ఆధారంగా బెంగుళూరు కస్టమ్స్ అధికారులు విచారణ నిర్వహించారు. విజయవాడ లోని కొరియర్ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి ఆధార్ కార్డుతో అస్ట్రేలియాకు కొరియర్ పంపిన విషయాన్ని దర్యాప్తులో గుర్తించారు కస్టమ్స్ అధికారులు. ఈ ఏడాది జనవరి 31 సత్తెనపల్లికి చెందిన ఓ వ్యక్తి పచ్చళ్లు పంపాలని కొరియర్ కార్యాలయానికి వచ్చినట్టుగా కొరియర్ సిబ్బంది కస్టమ్స్ అధికారుల విచారణలో వెల్లడించారు.
అయితే పచ్చళ్ల పేరుతో డ్రగ్స్ ను అస్ట్రేలియాకు ఎవరు పంపారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. విజయవాడలోని కొరియర్ ద్వారా నాలుగు కిలోల నార్కోటిక్స్ డ్రగ్స్ ను తరలించేందుకు పక్కా పథకం ప్రకారంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు.
విజయవాడలోని డీటీఎస్ కొరియర్ నుంచి ఆస్ట్రేలియాకు పంపిన పార్శిల్ ఆస్ట్రేలియాకు బదులుగా పొరపాటున కెనడా చేరింది. అక్కడ కవర్‌పై సరైన స్టిక్కరింగ్ లేకపోవడంతో దానిని తిప్పి పంపించారు. బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఆ పార్శిల్‌ను తనిఖీ చేస్తే అందులో 4,496 గ్రాముల నిషేధిత ‘ఎఫెండ్రిన్’ అనే తెలుపు రంగు డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.