ప్రకాశం జిల్లాలో బీర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. బీర్ బాటిల్స్ కోసం ఎగబడ్డ స్థానికులు..

Published : May 22, 2022, 11:41 AM IST
ప్రకాశం జిల్లాలో బీర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. బీర్ బాటిల్స్ కోసం ఎగబడ్డ స్థానికులు..

సారాంశం

ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ మండలంలో బీర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో పెద్ద ఎత్తున బీర్ బాటిల్స్ రోడ్డుపై పడిపోయాయి. లారీ శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లెకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ మండలంలో బీర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో పెద్ద ఎత్తున బీర్ బాటిల్స్ రోడ్డుపై పడిపోయాయి. లారీ శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లెకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇక, బీర్ల లోడ్‌తో వెళ్తున్న  లారీ బోల్తా పడిందనే విషయం తెలుసుకున్న స్థానికులు, మందుబాబులు అక్కడి పెద్ద ఎత్తున చేరుకున్నారు. రోడ్డుపై పడిన బీరు సీసాల కోసం స్థానికులు ఎగబడ్డారు. ఆదివారం రోజు రోడ్డుపై మద్యం బాటిల్స్ చూసిన మందుబాబులు ఫుల్ సంబరపడ్డారు. బీర్ బాటిల్స్‌కు జనాలు ఎగబడటంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. 

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. రోడ్డుపై పడిపోయిన పడిన బీర్ బాటిల్స్‌ను జేసీబీ సాయంతో పక్కనే ఉన్న కాలువలోకి నెట్టారు. అయిన కూడా కొందరు మందుబాబులు కాలువలోకి దిగి మరి పగలకుండా ఉన్న బీర్ బాటిల్స్‌ను సేకరించారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు