Bandi Sanjay: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి బండి!.. 21న అమరావతికి

By Mahesh KFirst Published Aug 18, 2023, 5:36 PM IST
Highlights

ఏపీ పాలిటిక్స్‌లోకి బండి ఎంట్రీ. ఈ నెల 21వ తేదీన ఆయన బీజేజీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో అమరావతికి వెళ్లనున్నారు. ఏపీలో ఓటరు నమోదు ప్రక్రియను సమీక్షించనున్నారు.
 

అమరావతి: బండి సంజయ్ ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. ఈ నెల 21న ఆయన అమరావతికి వెళ్లనున్నారు. జాతీయ ప్రధాన కార్యద్శి హోదాలో బండి అమరావతికి వెళ్లబోతున్నారు. ఏపీలో ఓటరు నమోదు ప్రక్రియను సమీక్షించనున్నారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. బండి సంజయ్ సేవలను రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఏపీ, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గోవా, ఒడిశాల్లోనూ బండి సంజయ్‌ సేవలను వినియోగించుకోవాలని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తున్నది. అందుకే ఈ రాష్ట్రాల బాధ్యతలనూ ఆయనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Latest Videos

Also Read: భావి సాంకేతిక అభివృద్ధిలో అన్ని దేశాల పాత్ర ఉండాలి: నాలుగు దేశాల మంత్రులతో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ భేటీ

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును తప్పించి కొత్త అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించిన సంగతి తెలిసిందే. కొత్త నాయకత్వంతో బీజేపీ కొత్త ఉత్సాహాలతో ముందుకు వెళ్లుతున్నది. దీనికి తోడు బండి సంజయ్ జోరు కూడా ఏపీ బీజేపీకి కలిసి రానుంది. మొత్తం వైసీపీపై విమర్శలు వేడెక్కనున్నట్టుగా తెలుస్తున్నది. కేంద్రంలో బీజేపీకి అటు తెలుగు దేశం పార్టీ, వైసీపీలు అనుకూలంగానే ఉంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో బీజేపీని పెంచాలనే లక్ష్యంతో ఈ పార్టీ కనిపిస్తున్నది. రాష్ట్రంలో జనసేన బీజేపీతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.

click me!