
2024 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పదవిపై తన ఆసక్తిని ఇప్పటికే చెప్పానని అన్నారు.పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని పవన్ తెలిపారు . టీడీపీ-జనసేన ప్రభుత్వం, బీజేపీతో కలిసి వెళ్లడమా అనే దానిపై అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పుడున్న పాలకులను బాధ్యులుగా చేస్తామన్నారు.
రాష్ట్రంలో క్రిమినాలిటీని లీగలైజ్ చేశారని పవన్ మండిపడ్డారు. రాయలసీమలో దోపిడి సాధ్యం కానందునే ఉత్తరాంధ్రపై పడ్డారని దుయ్యబట్టారు. ప్రతి పనికి రేట్ కార్డులు పెట్టి వైసీపీ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారని జనసేనాని ఆరోపించారు. రాష్ట్రాన్ని పన్నుల మయం చేశారని.. గ్రీన్ ట్యాక్స్ పేరుతో వేల కోట్లు వసూలు చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.