బాలకృష్ణ కొడుకు పేరుతో హల్ చల్ (వీడియో)

Published : Sep 06, 2017, 09:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
బాలకృష్ణ కొడుకు పేరుతో హల్ చల్ (వీడియో)

సారాంశం

ప్రముఖ సినీనటుడు  నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ పేరుతో కొందరు బుధవారం హల్ చల్ చేసారు విజయవాడకు సపమీపంలోని కంచికచర్లలో. జరిగిందేమిటంటే, ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజు. దాంతో కొందరు అభిమానులు పుట్టినరోజు వేడుకల పేరుతో కంచికచెర్ల చెరువుకట్ట సమీపంలో గందరగోళం చేసారు. కార్మికులు ఆపుతున్నా  కార్లను ఆపకుండానే సినిమాలో చూపినట్లు కోన్లను ఇష్టమొచ్చినట్లు డ్యాష్ ఇచ్చి పడేసారు.

 సినీనటుడు నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ పేరుతో కొందరు బుధవారం హల్ చల్ చేసారు విజయవాడకు సపమీపంలోని కంచికచర్లలో. జరిగిందేమిటంటే, ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజు. దాంతో కొందరు అభిమానులు పుట్టినరోజు వేడుకల పేరుతో కంచికచెర్ల చెరువుకట్ట సమీపంలో గందరగోళం చేసారు. నేషనల్ హై వేని కొందరు కార్మికులు సాయంత్రం శుభ్రం చేస్తున్నారు. ఆ రోడ్లపైకి ఎవరు రాకుండా  కోన్లను అడ్డుపెట్టారు కాంట్రాక్టర్. అయితే, అదే సమయంలో కొందరు కార్లలో ఆ రోడ్డుపైకి దూసుకువచ్చేసారు. కోన్లను కూడా కొట్టుకుంటూ వచ్చేసారు. కార్మికులు ఆపుతున్నా  కార్లను ఆపకుండానే సినిమాలో చూపినట్లు కోన్లను ఇష్టమొచ్చినట్లు డ్యాష్ ఇచ్చి పడేసారు.

 

ఇదేమని నిలదీసిన సిబ్బంది పై ఒక్కసారిగా దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. కార్ల ధాటికి  ప్లాస్టిక్ కోన్లు ప్రక్కనే ఉన్న  చెరువులోని కి, పొల్లాలోకి ఎగిరివెళ్లి పడ్డాయట. అక్కడ పనిచేస్తున్నది మొత్తం మహిళలే కాబట్టి అందరూ భయపడిపోయారు. బీభత్సాన్ని చూసి వణికిపోతున్న కార్మికుల పట్ల  దురుసుగా కుడా ప్రవర్తించారట.

 

జాతీయ రహదారిపై కార్లతో ర్యాలీ చేస్తున్నప్పటికీ పోలీస్ సిబంది చూస్తు ఉండిపోయారట. విషయం తెలిసిన మీడియా అక్కడికి వెళ్ళి కార్మికులతో మాట్లాడటానికి ప్రయత్నిచినపుడు ఏమి జరిగిందనే విషయాన్ని చెప్పటానికి అందరూ భయపడుతున్నారు. బీభత్సం జరిగింది వాస్తవమే అని చెబుతున్న కార్మికులు ఏమి జరిగిందో మాత్రం చెప్పటానికి ఇష్టపడటం లేదు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu