
వ్యవసాయ విశ్వ విద్యాలయం విద్యార్ధుల డిమాండ్ మేరకు ప్రభుత్వం జీవో 64 రద్దు చేసినందుకు సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఈ మేరకు పవన్ తన ట్వట్టర్లో చంద్రబాబునాయుడుతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కుడా ధన్యవాదాలు తెలిపారు. జీవో 64 రద్దు చేయటం వ్యవసాయ విద్యార్దులకు పెద్ద రిలీఫ్ గా పవన్ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖాధికారుల నియామకంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్ధులు చాలాకాలంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే కదా? ప్రభుత్వం వీరి డిమాండ్ ను ఎంతకీ పట్టించుకోకపోతే చివరకు వీరంతా పవన్ను కుడా ఆమధ్య కలిసారు. దాంతో పవన్ విద్యార్ధులకు మద్దతు పలికారు.
జీవో రద్దు విషయంపై పవన్ స్పందిస్తూ విద్యార్ధులు తమ ఆశయాలను నిలపుకునేందుకు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ రంగంతో పాటు నిరాసలో కూరుకపోతున్న రైతుల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.