‘అలా ఐతే ఉండండి.. లేకపోతే గెటౌట్’

First Published Sep 7, 2017, 12:21 PM IST
Highlights
  • నియోజకవర్గంలో పార్టీ, అభివృద్ధి కార్యక్రమాలపై బాలయ్య బుధవారం సమీక్షిస్తూ నేతల వైఖరిని తప్పుపట్టారు.
  • మండలాల వారీగా బలయ్య సమీక్షించినపుడు నేతల్లోని వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.
  • ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవటంతో బాలయ్యకు చిర్రెత్తింది.
  • అదే సమయంలో నేతలపై ప్రధానంగా చిలమత్తూరు మండల నేతలపై ఎంఎల్ఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.  

'నియోజకవర్గం ప్రజలను అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల చెంతకు చేర్చాలన్నది నా తపన. అందుకు మీరు కలిసి వస్తే ఉండండి ... లేదంటే వెళ్లిపోండి.'..ఇది నియోజకవర్గంలోని నేతలపై హిందూపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు. నియోజకవర్గంలో పార్టీ, అభివృద్ధి కార్యక్రమాలపై బాలయ్య బుధవారం సమీక్షిస్తూ నేతల వైఖరిని తప్పుపట్టారు. మండలాల వారీగా బలయ్య సమీక్షించినపుడు నేతల్లోని వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవటంతో బాలయ్యకు చిర్రెత్తింది. అదే సమయంలో నేతలపై ప్రధానంగా చిలమత్తూరు మండల నేతలపై ఎంఎల్ఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.  

చిలమత్తూరు ప్రజాప్రతినిధులు, నాయకులతో రెండుగంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు తమ గోడును వెళ్ళబోసుకుంటూ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా చేసిన వారిని ఎలా కలుపుకొని వెళతామని పేర్కొంటూ కొందరిపై ఫిర్యాదు చేసారు.  దాంతో అక్కడే ఉన్న వ్యతిరేకవర్గం నేతలు మాట్లాడుతూ, ‘తాము పార్టీకి విధేయులమని పార్టీ కార్యక్రమాలకు తమను దూరంగా పెట్టటం వల్లే గ్రూపులు ఏర్పడ్డాయ’ని వివరణ ఇచ్చారు. అంతటితో ఆగకుండా ‘గ్రూపుల వల్లే పార్టీ దెబ్బతింటోందని ఇలాగే ఉంటే మరింత పతనమవుతుంద’ని ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.

ఇదంతా తన ముందే జరుగుతుండటం, పైగా ఒకిరపై మరొకరు తీవ్రస్ధాయిలో విరుచుకుపడుతుండటంతో చిర్రెత్తిపోయిన బాలకృష్ణ  రెండు వర్గాల నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘కలిసి పనిచేస్తే ఓకే.. లేదంటే గెట్‌అవుట్‌’.. అంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఇదే సందర్భంలో పార్టీ మండల కన్వీనర్‌ బాబుల్‌రెడ్డిని కుడా తీవ్రంగా మందలించారు. హిందూపురంల నేతల జోక్యం వల్లే నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లోనూ గ్రూపులు ఏర్పడ్డాయని పలువురు ఫిర్యాదు చేసారు.  

అసలు సమస్యంతా ఎక్కడ మొదలైందంటే, ఎంఎల్ఏగా ఉన్న బాలయ్య తనకు వీలున్నపుడు మాత్రమే నియోజకవర్గంలో పర్యటిస్తుంటారు. దానికితోడు స్ధానిక నేతలతో కుడా పెద్దగా టచ్ లో ఉండరు. దాంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో నేతలకు అర్ధం కావటం లేదు. 6 మాసాల క్రితం వరకు కుడా బాలకృష్ణ పిఏ శేఖర్ దే పత్తనంగా సాగింది. పిఏ అరాచకాలను సహించలేక మూకుమ్మడిగా నేతలందరూ పార్టీకి రాజీనామా చేసే పరిస్ధితి వచ్చిన తర్వాత కానీ బాలయ్య మేలుకోలేదు. నేతల్లో గ్రూపులను సహించనని చెప్పటం వరకు బాగానే ఉందికానీ అందుకు అవకాశాలు ఇచ్చింది మాత్రం బాలయ్యే అనటంలో అనుమానమే లేదు.

click me!