ఆదిపై కేంద్రప్రభుత్వం ఆగ్రహం

Published : Sep 07, 2017, 09:16 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
ఆదిపై కేంద్రప్రభుత్వం ఆగ్రహం

సారాంశం

దళితులు శుభ్రంగా ఉండరని, చదువుకోరని మంత్రి స్వాతంత్ర్య దినోత్సవం రోజు చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇపుడా వ్యాఖ్యలపైనే కేంద్రమంత్రి తావర్ చంద్ గెహ్లాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారట. మంత్రి వ్యాఖ్యలపై బుధవారం ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ సభ్యుడు జోరుగడ్డ అనిల్ కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసారు.

మంత్రి ఆదినారాయణరెడ్డిపై కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దళితులను కించపరిచేలా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దళితులు శుభ్రంగా ఉండరని, చదువుకోరని మంత్రి స్వాతంత్ర్య దినోత్సవం రోజు చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇపుడా వ్యాఖ్యలపైనే కేంద్రమంత్రి తావర్ చంద్ గెహ్లాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారట. మంత్రి వ్యాఖ్యలపై బుధవారం ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ సభ్యుడు జోరుగడ్డ అనిల్ కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసారు. వెంటనే స్పందించిన కేంద్రమంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై నివేదిక కోరారు. అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ, మంత్రి వ్యాఖ్యలపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు కుడా ఫిర్యాదు చేయనున్నట్లు అనిల్ తెలిపారు.

ఏపి రాజధాని ప్రాంతంలో దళితుల భూములను ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను ప్రశ్నించినందుకు తనపై కేసులు పెట్టి అరెస్టు కుడా చేసిందన్నారు. తనపై ప్రభుత్వం మోపిన అక్రమ కేసులు, అరెస్టు వివరాలను కుడా కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా అక్రమ కేసులు, అరెస్టుల అంశాన్ని పరిశీలించాలని ఎస్సీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ను కుడా కేంద్రమంత్రి కోరినట్లు అనిల్ చెప్పారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్