‘అక్కా.. ఐయాం సారీ, కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి. బై ..’ వాట్సప్ మెసేజ్ పెట్టి క్రీడాకారిణి ఆత్మహత్య..

Published : Dec 28, 2021, 06:38 AM IST
‘అక్కా.. ఐయాం సారీ, కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి. బై ..’ వాట్సప్ మెసేజ్ పెట్టి క్రీడాకారిణి ఆత్మహత్య..

సారాంశం

సోమవారం తెల్లవారుజామున బ్యాడ్మింటన్ ఆడేందుకు బయల్దేరే ఆదిలక్ష్మి దేవుడి గదిలోకి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె అక్క ధనకుమారి వెళ్లి చూడగా ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయినట్లు ధ్రవీకరించారు. 

యానాం : ‘అక్కా.. నాకు వెళ్లాలని లేదు. కానీ మొన్నటి నుంచి ఆలోచనలో పడ్డా. మన ఫ్యూచర్ కోసం నాన్నమ్మ భయంతో ఉందని అర్థమైంది. ఓ పక్క నాన్న ఇంట్లో ఏం పట్టించుకోరు. నాన్నమ్మకి, అమ్మకి ఆరోగ్యం బాలేదు. భవిష్యత్తు ఏమవుతుందోనని భయంగా ఉందక్కా. నావల్ల కాదు. ఐయాం సారీ, కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి. బై అక్కా..’ అంటూ ఆదివారం అర్థరాత్రి దాటాక 2.53 గంటలకు WhatsApp Message పంపించి.. ఓ యువ Athlete తన నిండు జీవితాన్ని చాలించింది. 

యానాం పోలీసులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక జీఎంసీ బాలయోగి కాలనీకి చెందిన దండుప్రోలు ధర్మారావు చిన్న కుమార్తె 
Adilakshmi. Ball Badminton క్రీడాకారిణి. ఆటలో రాణిస్తూ 2019, 2020లలో ఎస్ సీఎఫ్ఐ, సబ్ జూనియర్ నేషనల్స్ పోటీల్లో పాల్గొంది. చేపల వ్యాపారం చేసే తండ్రి ఖాళీగా ఉంటుండటంతో భవిష్యత్తు మీద బెంగతో బలవన్మరణానికి పాల్పడింది. 

సోమవారం తెల్లవారుజామున బ్యాడ్మింటన్ ఆడేందుకు బయల్దేరే ఆదిలక్ష్మి దేవుడి గదిలోకి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె అక్క ధనకుమారి వెళ్లి చూడగా ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయినట్లు ధ్రవీకరించారు. ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఆదిలక్ష్మి జనవరిలో జరగనున్న స్కూల్ గేమ్స్ పోటీలకు సిద్ధమవుతోంది. 

ఏపీలో సంచలనంగా మారిన లవ్‌ లైఫ్‌ మోసం.. రీచార్జిల పేరుతో రూ. 200 కోట్ల లూటీ.. ఇంతకీ అనసూయ ఎవరు..?

ఇదిలా ఉండగా, అమరావతిలో విషాదం చోటుచేసకుంది. కొందరు పిల్లలు క్రిస్మస్ సెలవుల సందర్భంగా మిత్రులతో కలిసి ఇంటి వెనుకాల చెట్టుకు చీరను కట్టి ఏర్పాటు చేసిన ఊయలలో ఆడుకున్నారు. ఇలా ఆడుకుంటుండగా చీరను మెలికలు వేస్తూ గుండ్రంగా తిప్పాడు ఓ బాలుడు. ఈ క్రమంలోనే బాలుడి మెడకు చీర గట్టిగా చుట్టుకుని ఊపిరాడకుండా చేసింది. చీర బిగుసుకుపోవడంతో మిత్రులు చూస్తుండగా పిల్లాడు మరణించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలంలో శనివారం జరిగింది.

కోడూరిలోని అంబటి బ్రాహ్మణయ్య కాలనీకి చెందిన రామాంజనేయులు, అంజలీ దేవి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి పేరు చైతన్య, రెండో కుమారుడి పేరు బాలవర్దన్. చిన్న కుమారుడు వడ్డెర కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో అన్నదమ్ములు చైతన్య, బాలవర్దన్‌లు కాలనీలోని ఇతర మిత్రులతో కలిసి.. తమ ఇంటి వెనుక ప్రాంతంలో చెట్టుకు చీరతో కట్టిన ఊయలలో ఆడారు. 

చైతన్య హుషారుగా ఊయలలోకి ఎక్కి ఆడాడు. అలా ఆడుకుంటూనే చీరను మెలిపెట్టాడు. ఊయలను గుండ్రంగా తిప్పాడు. అంతే.. అది తన ప్రాణం తీసింది. చీర గట్టిగా మెడకు బిగుసుకుపోవడంతో తోటి స్నేహితులు చూస్తుండగానే చైతన్య ఊపిరి వదిలాడు. చీర మధ్యలో మాట్లాడకుండా విగత జీవిలా మారిపోయాడు. భయంతో చిన్నారులు పరుగున వెళ్లి చైతన్య తల్లిదండ్రులకు విషయం చెప్పారు. తల్లిదండ్రులు వెంటనే ఊయల దగ్గరకు వెళ్లారు. కానీ, చైతన్య అప్పటికే ప్రాణాలు వదిలేశాడు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్