జగన్ పై దాడి: ఎపి డీజీపికి గవర్నర్ ఫోన్ చేసి ఆరా

By pratap reddyFirst Published Oct 25, 2018, 1:55 PM IST
Highlights

హైదరాబాదు వచ్చేందుకు విశాఖ విమానాశ్రయం లాంజ్ లో కూర్చున్న జగన్ పై శ్రీనివాస్ రావు అనే వెయిటర్ దాడి చేసిన విషయం తెలిసిందే.  జగన్ పై దాడి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

హైదరాబాద్: వైఎఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిపై గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. ఈ సంఘటనపై వివరాలు అడిగేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపి ఆర్పీ ఠాకూర్ కు ఫోన్  చేశారు. 

హైదరాబాదు వచ్చేందుకు విశాఖ విమానాశ్రయం లాంజ్ లో కూర్చున్న జగన్ పై శ్రీనివాస్ రావు అనే వెయిటర్ దాడి చేసిన విషయం తెలిసిందే. 

జగన్ పై దాడి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రాథమిక చికిత్స అనంతరం జగన్ హైదరాబాదు బయలుదేరి వచ్చారు. శ్రీనివాస్ తొలుత ఫోర్కుతో దాడి చేసినట్లు సమాచారం అందినప్పటికీ అతను వాడింది కోళ్ల పందేలకు వాడే కత్తి అని తెలుస్తోంది.

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

click me!