రాజమహేంద్రవరంలో మహాసేన అధ్యక్షుడు రాజేష్ పై దాడి..

Published : Jan 02, 2023, 08:39 AM IST
రాజమహేంద్రవరంలో మహాసేన అధ్యక్షుడు రాజేష్ పై దాడి..

సారాంశం

జనసేనకు మద్దతు ఇస్తున్నారంటూ మహాసేన అధ్యక్షుడు రాజేష్ పై దుండగులు దాడికి దిగారు. ఆదివారం రాత్రి రాజమహేంద్రవరంలో ఈ ఘటన జరిగింది.

రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో  ఆదివారం రాత్రి మహాసేన అధినేత రాజేష్ పై దాడి జరిగింది.  ఆదివారం జనసేన నగర అధ్యక్షుడు వై. శ్రీనివాస్ పుట్టినరోజు కావడంతో…ఆ వేడుకలకు హాజరవడానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాజేష్ పై దాడి అధికార పార్టీ నాయకుల పనే అని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.  ఆదివారం 9:30 సమయం లోరాజమహేంద్రవరంలోని వై జంక్షన్ దగ్గర శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమానికి మహాసేన అధినేత రాజేష్ వస్తారని తెలుసుకున్న కొంతమంది నందం గనిరాజు కూడలిలో కాపు కాశారు. రాజేష్ వాహనాన్ని అడ్డుకుని, దాడికి తెగబడ్డారు. మహాసేన అధ్యక్షుడు రాజేష్ జనసేనకు మద్దతు ఇవ్వడాన్ని నిలదీశారు. ఇదంతా చూస్తున్న జనసేన నాయకులు రాజేష్ కారు వద్దకు చేరుకుని.. ఆయనను వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. అయితే, దుండగులు ఒక్కసారిగా రాజేష్ పై దాడికి దిగారు. 

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ !!

రాజేష్ కారు మీద రాళ్లు, బీరుసీసాలు విసిరి హంగామా చేశారు. మరికొంతమంది దుండగులు కారు అద్దారు పగలగొట్టారు. దాడి అనంతరం మహాసేన రాజేష్ మాట్లాడుతూ.. జనసేనకు మద్దతునిచ్చినప్పుడే నా ప్రాణాలకు తెగించాను. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రోజూ నా ప్రాణాలను ఫణంగా పెట్టాను. నన్ను చంపిన తరువాతైనా వైసీపీ అక్రమాలను నా జాతి తెలుసుకుంటే.. అర్థం చేసుకుంటే చాలు.. నా ప్రాణాలను తీసినా.. మాలోని ధైర్యాన్ని మాత్రం చంపలేరు’అంటూ చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!