అశోక్ గజపతిరాజుపై మంత్రి కామెంట్స్ అమానుషమని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
రామతీర్ధం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుపై దాడి అమానుషమని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. మంత్రుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ విజసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయ ధర్మకర్తతో అస్సలు సరితూగరని విమర్శించారు.
అశోకగజపతి రాజు విరాళం ఇచ్చినా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. స్వయంగా మంత్రి నియోజకవర్గంలోని దేవాలయంలో విగ్రహాలు మాయమైతున్నాయని ఆరోపించారు. మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అశోక్‌గజపతిరాజుపై మంత్రి శ్రీనివాస్ కామెంట్స్ చేయడం ఏంటని అన్నారు. ఆయనకు ప్రజల్లో తిరిగే హక్కులేదని తెలిపారు. ధర్మకర్తకు మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అశోకగజపతిరాజును అవమానించడమే ఎంపీ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. దీనిని ముఖ్యమంత్రి ప్రొత్సహిస్తున్నారని తెలిపారు. గొప్ప ధర్మకర్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. రాముడి విగ్రహాన్ని విరిగిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇది ప్రభుత్వ చేతగాని చర్య అని విమర్శించారు. అశోక్ గజపతిరాజుపై మంత్రి చేసిన కామెంట్స్ వెంటనే ఉపసంహరించుకోని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించాలని తెలిపారు. లేకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక కేసులో ట్విస్ట్: విచారణ నుండి తప్పుకొన్న జడ్జి, మరో బెంచీకి కేసు
మంత్రులను బర్త్‌రఫ్ చేయలి- కిమిడి నాగార్జున
అశోక్ గజపతి రాజుపై కామెంట్స్ చేసిన మంత్రులను వెంటనే బర్త్‌రఫ్ చేయాలని విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచే అశోక్ గజపతిరాజును టార్గెట్ చేశారని ఆరోపించారు. విజనగరానికి ఆయన పూర్వీకులు ఎంతో సేవ చేశారని అన్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు. కావాలని మంత్రి బొత్ససత్యనారాయణ, వెల్లంపల్లి వెల్లంపల్లి కావాలనే ఆయనను అవమానించేలా మాట్లాడారని అన్నారు. దీని వెనుకు ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారని ఆరోపించారు. ఆలయ ధర్మకర్తగా అశోక్ జగపతి రాజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పారని తెలిపారు. ఆయనను కావాలనే వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని అన్నారు. విజయనగరం జిల్లాకు ఆయన ఎంతో సేవ చేశారని అన్నారు. రాముడి సన్నిధిలో మంత్రులు ఆయనను అవమానించడం సరైంది కాదని అన్నారు. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించకుండా అశోక్ గజపతిరాజుపై కామెంట్స్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
బూతుల మంత్రితో కొబ్బరిచిప్పల మంత్రి పోటీ...: రామతీర్థం ఘటనపై చంద్రబాబు సీరియస్
జిల్లాలోని రోడ్లన్నీ అస్తవ్యస్థంగా ఉన్నాయని ఆరోపించారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి మంత్రి బొత్స సత్యనారాయణ కృషి చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఆ సమస్యలేవీ ఏపీ ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అశోక్ గజపతి రాజును టార్గెట్ చేసుకున్నారని ఆరోపించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉంటారని తెలిపారు. వారే అన్నింటికీ సమాధానం చెబుతారని తెలిపారు. మంత్రులు, ప్రభుత్వం అశోక్ గజపతిరాజుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.