చూస్తూ ఊరుకోం... అధికారంలోకి రాగానే గుణపాఠం తప్పదు: అచ్చెన్న వార్నింగ్

Arun Kumar P   | Asianet News
Published : Jun 24, 2021, 10:25 AM IST
చూస్తూ ఊరుకోం... అధికారంలోకి రాగానే గుణపాఠం తప్పదు: అచ్చెన్న వార్నింగ్

సారాంశం

రోజులెప్పుడూ మీవే వుండవని జగన్ రెడ్డి గూండాలు గుర్తుంచుకుంటే మంచిది.... మీ పాపాలన్నింటికి బదులు తీర్చుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అని అచ్చెన్నాయుడు హెచ్చరించాారు.      

అమరావతి: నవ్యాంధ్రను వైసీపీ నేతలు హత్యాంధ్రప్రదేశ్ గా మార్చారని రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అధికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ కార్యకర్తలను వేధించడమే వైసీపీ పనిగా పెట్టుకుందని అచెన్న అన్నారు. 

''ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. బాధిత కుటుంబాలకు టీడీపీ అన్ని విధాలా అండగా వుంటుంది. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఈ దురాగతాలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడు.? జరిగే అరాచకం కళ్లకు కనిపించడం లేదా? జర్మనీలో నాజీల దురాగతాలను మించి ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి అరాచకాలు ఉన్నాయి'' అంటూ మండిపడ్డారు. 

''రోజులెప్పుడూ మీవే వుండవని జగన్ రెడ్డి గూండాలు గుర్తుంచుకుంటే మంచిది. మీ పాపాలన్నింటికి బదులు తీర్చుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక 27 మంది టీడీపీ కార్యకర్తలను బలితీసుకున్నారు. 1400మందిపై పైగా దాడులు పాల్పడ్డారు. ఇన్ని హత్యలు, దాడుల జరుగుతున్నా డీజీపీ కంటికి కనిపించడం లేదా.? హత్యల్లో పాత్రులైన వారిలో ఒక్కరినైనా పట్టుకుని శిక్ష విధించారా? నీతి, న్యాయం, ధర్మానికి ప్రతిగా ఉన్న మూడు సింహాలను అరాచకం, అక్రమ కేసులు, బంధుప్రీతికి చిహ్నాలుగా మారుస్తున్నారు'' అని ఎద్దేవా చేశారు. 

read more  ఇక లేట్ చేయొద్దు... రఘురామపై అనర్హత వేటు వేయండి: స్పీకర్ ఓం బిర్లాకు విజయసాయి లేఖ

''జగన్ రెడ్డిని చూసుకుని వైసీపీ వాళ్లు రెచ్చిపోతే భవిష్యత్ లో మీరు తీవ్రంగా నష్టపోతారు. రాష్ట్రంలో తిష్టవేసిన సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఏదో ఒక అల్లరిని రాష్ట్రంలో లేవనెత్తుతున్నారు. హత్యలతో రాష్ట్రంలో రక్తపాతం సృష్టిస్తున్నారు. పరిశ్రమలతో కలకలలాడాల్సిన నవ్యాంధ్ర ఇప్పుడు దాడులు, హత్యలతో విలవిల్లాడుతోంది'' అన్నరు.

''పెట్టుబడిదారులతో పరిశ్రమల సంఖ్య నమోదుకావాల్సిన రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లలో టీడీపీ వారిపై అక్రమ కేసులతో ఎఫ్ఐఆర్ లు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భధ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇష్టానుసారంగా మా కార్యకర్తలపై దాడులకు తెగబడతామంటే చూస్తూ ఊరుకోం. టీడీపీ అధికారంలోకి వచ్చాక గుణపాఠం తప్పదు'' అపి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే వుంది | Asianet News Telugu
Chandrababu Speech:నన్ను420అన్నా బాధపడలేదు | Siddhartha Academy Golden Jubilee | Asianet News Telugu