దుగ్గిరాలలో ఘోర రోడ్డుప్రమాదం... మహిళ మృతి, మరో ఏడుగురికి తీవ్ర గాయాలు (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jun 24, 2021, 10:07 AM ISTUpdated : Jun 24, 2021, 10:11 AM IST
దుగ్గిరాలలో ఘోర రోడ్డుప్రమాదం... మహిళ మృతి, మరో ఏడుగురికి తీవ్ర గాయాలు (వీడియో)

సారాంశం

పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుని వెళ్ళడమే కాదు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  

గుంటూరు: ఆటో డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ మహిళ ప్రాణాలను బలితీసుకోవడమే పలువురిని హాస్పిటల్ పాలు చేసింది. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుని వెళ్ళడమే కాదు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదం గుంటూరు జిల్లాలో జరిగింది. 

దుగ్గిరాల మండలం చింతలపూడి వద్ద రోడ్డు పక్కన పసుపు లోడుతో నిలిపి వుంచిన ట్రాక్టర్ ను ప్రయాణీకులతో కూడిన ఆటో ఢీకొట్టింది. అతివేగంగా వచ్చిన ఆటో అదుపుతప్పి ట్రాక్టర్ ను వెనకనుండి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పులివర్తి రత్నకుమారి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. 

read more   అక్రమ బంధానికి అడ్డుగా వున్నాడని... కన్నతండ్రినే కడతేర్చిన కసాయి కొడుకు

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఇలా ఆటో డ్రైవర్ తో పాటు ఏడుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. 

వీడియో

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. అయితే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమయి వుంటుందని భావిస్తున్నారు. 

 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు