Atchannaidu: బీసీ సంక్షేమంపై వైసీపీకి ధైర్యముంటే చర్చకు రావాలి.. అచ్చెన్నాయుడు సవాలు..

Published : Nov 23, 2021, 05:15 PM IST
Atchannaidu: బీసీ సంక్షేమంపై వైసీపీకి ధైర్యముంటే చర్చకు రావాలి.. అచ్చెన్నాయుడు సవాలు..

సారాంశం

బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan), వైసీపీ నేతలకు లేదని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శించారు.  బీసీ సంక్షేమంపై (BC Welfare) వైసీపీకి ధైర్యముంటే చర్చకు రావాలని అచ్చెన్నాయుడు సవాలు విసిరారు. 

బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan), వైసీపీ నేతలకు లేదని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శించారు. జగన్ పాలనలో బీసీలకు వంచనే జరిగిందన్నారు. బీసీలను అణగదొక్కడమే లక్ష్యంగా రెండున్నరేళ్ల జగన్ పాలన సాగిందన్నారు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్ల కోతతో 16,800 మందికి పదవులు దూరం చేశారని మండిపడ్డారు. బీసీ జనగణణ కోరుతూ 2014లో టీడీపీ తీర్మానం చేసిందన్నారు. మళ్లీ తీర్మానం పేరుతో జగన్ బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ కేసుల కోసం తిరగడం తప్ప.. బీసీ గణనపై ఒత్తిడి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
 
మున్సిపల్ చైర్మన్లు,  మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లుగా ఉన్న బీసీలకు షాడోలను నియమించడం ద్రోహం కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తిరుపతి మేయర్‌గా బీసీని నియమించి.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరో నేతను షాడోను నియమించడం వాస్తవం కాదా అని నిలదీశారు. రాష్ట్రంలో మంత్రులను స్వతంత్రగా పనిచేయనివ్వడం లేదని ఆరోపించారు. వెయ్యికిపైగా ఉన్న నామినేటెడ్ పదవుల్లో బీసీలు 10శాతం కూడా లేరని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 16 యూనివర్శిటీల్లో 9 వర్శిటీలకు వీసీలుగా టీడీపీ బీసీలను నియమించిందన్నారు. బీసీ సంక్షేమంపై (BC Welfare) వైసీపీకి ధైర్యముంటే చర్చకు రావాలని అచ్చెన్నాయుడు సవాలు విసిరారు. 

Also read: బీసీలను బ్యాక్‌బోన్ క్లాసులుగా మారుస్తాం: అసెంబ్లీలో వైఎస్ జగన్

ఇక, ఈ రోజు ap assemblyలో కులాల వారీగా బీసీ జన గణన జరగాలని ప్రవేశ పెట్టిన తీర్మానంపై సీఎం జగన్ ప్రసంగించారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాసులుగా మారుస్తామని జగన్ చెప్పారు. కులాల వారీగా బీసీ జనాభా ఎంతుందో అనే విషయమై ఎప్పుడూ మదింపు జరగలేదన్నారు. ఎప్పుడో 90 ఏళ్ల క్రితం కులాల వారీగా జన గణన జరిగిందని ఆయన గుర్తు చేశారు.  రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి  బీసీ జన గణన జరగలేదన్నారు. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబాటుతనం ఎంతుందో తెలియాలంటే కుల గణన అవసరమని ఆయన చెప్పారు.  సమాజంలో కొద్దిమంది మాత్రమే అధికారం దక్కించుకొంటున్నారన్న భావన ఉందని సీఎం ys jagan అభిప్రాయపడ్డారు.  bc  కుల గణన జరగాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నామని సీఎం తెలిపారు. కుల గణన జరిగితే మరింత వెసులుబాటు ఉంటుందన్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారని తెలిస్తేనే వారికి న్యాయం చేయగలుగుతామన్నారు. 

chandrababu ప్రభుత్వంలో  బీసీలను కూడా విభజించారన్నారు. తమ పార్టీకి ఓటు వేసిన వారికి కొద్ది మేరకు పథకాలు ఇచ్చారన్నారు. ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాలను ఇవ్వలేదని జగన్ ఆరోపించారు. జన్మభూమి కమిటీలు ఎలా పనిచేశాయో చూశామని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హుత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తమ పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా బీసీలంతా మనవారేనని ఆయన స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్