కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నికను బుధవారం నాడు నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే ఎన్నిక పూర్తయ్యే వరకు కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.టీడీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ నిర్వహించిన విషయం తెలిసిందే.
విజయవాడ: కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నికను బుధవారం నాడు నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నివేదికను తమకు అందించాలని కోరింది.కొండపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై tdp దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ap high court మంగళవారం నాడు విచారణ నిర్వహించింది. మధ్యాహ్నం నాడుkondapalli municipality కమిషనర్, Vijayawada సీపీలను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని విజయవాడ ఇంచార్జీ సీపీకి ap high court ఆదేశించింది.
రెండు రోజులుగా కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక వాయిదా పడింది. నిన్న, ఇవాళ కూడా మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించలేదు. వైసీపీకి చెందిన కౌన్సిలర్ల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. విజయవాడ ఎంపీ కేశినేని నానికి ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం లేదని వైసీపీ తీవ్ర అభ్యంతరం చెబుతుంది. ఇదే విషయమై నిన్న, ఇవాళ కూడా వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆందోళనలకు దిగారు.
also read:Kondapalli municipality: కొండపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ఎన్నిక వాయిదాపై ఏపీ హైకోర్టు ఆగ్రహం..
దీంతో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఏపీ హైకోర్టులో టీడీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ ఉదయం ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణను నిర్వహించింది. మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడ సీపీ, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ ను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం.
ఈ ఇద్దరు కోర్టుకు హాజరైన సమయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు మున్సిపల్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ ఎన్నికను పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు ఎన్నికల ఫలితాన్ని ప్రకటించకుండా సీల్డ్ కవర్లో అందించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఛైర్మెన్, వైఎస్ ఛైర్మెన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని విజయవాడ సీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 స్థానాలున్నాయి. టీడీపీకి 14, వైసీపీకి 14 స్థానాలు వచ్చాయి. ఒక్క స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్ధి లక్ష్మి విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్ధి ఆ తర్వాత టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం 15కి చేరింది. అయితే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటును కొండపల్లి మున్సిపాలిటీలో వినియోగించుకొంటానని లేఖ రాశారు. ఈ విషయమై స్పందన రాకపోవడంతో ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాష్ట్రంలోని 87 మున్పిపాాలిటీలకు జరిగిన ఎణ్నికల్లో 84 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. గతంలో జరిగిన ఎన్నికల్లో తాడిపత్రిలో టీడీపీ విజయం సాధించింది. ఈ నెలలో జరిగిన ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన స్థానంలో టీడీపీ గెలుపొందింది. కొండపల్లిలో టీడీపీ మెజారిటీ స్థానాలను దక్కించుకొంది. అయితే ఎన్నిక మాత్రం జరగలేదు.