హోదాపై అశోక్ అతి తెలివి

Published : Feb 13, 2017, 11:28 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
హోదాపై అశోక్ అతి తెలివి

సారాంశం

చంద్రబాబు జేబులో మనిషిగా ప్రచారంలో ఉన్న అశోక్ బాబు ఇంతకన్నా భిన్నంగా మాట్లాడుతారని ఎవరైనా అనుకుంటారా?

ఉద్యోగాలు చేస్తూ ప్రత్యేకహోదా ఉద్యమంలో ఎలా పాల్గొంటామని ఏపిఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు ప్రశ్నించారు. నిజంగా కరెక్టే. మరి సమైక్య ఉద్యమంలో మాత్రం ఎలా పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణాను అడ్డుకోలేమని తెలిసీ మొత్తం ఉద్యోగులను ఇదే అశోక్ బాబు 75 రోజుల పాటు రోడ్లమీదకు ఈడ్చారు కదా? ఈ తెలివి అప్పట్లో ఏమైంది? అన్నీ రాజకీయ పార్టీలు కలిసి పోరాటం చేస్తేనే ఉద్యోగులుగా మద్దతిస్తామని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారండోయ్. ఎందుకంటే, ’అన్నీ‘  పార్టీలు కలవటమన్నది జరగదని తెలుసుకాబట్టే. మరి, ఇదే అశోక్ బాబు సమైక్య ఉద్యమంలో ఒక్క రాజకీయ పార్టీని కూడా ఉద్యోగ జెఏపి దగ్గరకు రానీయలేదు.  

 

గడచిన రెండున్నరేళ్లుగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా అధికార టిడిపి మాత్రం ప్రత్యేకహోదాను వ్యతిరేకిస్తున్న విషయం అశోక్ బాబుకు తెలీదా? రాజకీయపార్టీలు విడివిడిగా పోరాటం చేస్తే ప్రత్యేకహోదా రాదన్న కొత్త విషయాన్ని కూడా చెప్పారు. అన్నీ రాజకీయ పార్టీలు ఢిల్లీ వెళ్లి హోదా కోసం పోరాటం చేయాలట. ఎవరికి చెప్పాలి ఈ మాటను? పైగా హోదా హామీ ఇచ్చిన పార్టీలు హామీని నిలబెట్టుకోవాలంటూ సన్నాయి నొక్కులొకటి మళ్ళీ. చంద్రబాబు జేబులో మనిషిగా ప్రచారంలో ఉన్న అశోక్ బాబు ఇంతకన్నా భిన్నంగా మాట్లాడుతారని ఎవరైనా అనుకుంటారా?

 

 

PREV
click me!

Recommended Stories

చేతుల మీద కర్పూరం వెలిగించి హారతి ఇచ్చిన మహిళ | CBN Full Speech At House Pattas Distribution
మహిళ స్పీచ్ కి దండంపెట్టేసిన బాబు | Chandrababu Giving House Pattas To Beneficiaries