
అవినీతి ఆరోపణలతో సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న వారు చట్టాలు, రాజ్యాంగం గురించి మాట్లాడకూడదా? చంద్రబాబు విచిత్రమైన వాదనను వినిపిస్తున్నారే. చట్టం, రాజ్యంగం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అపహాస్యంగా ఉంటుందట. మరి, చంద్రబాబుపై ఉన్న అవినీతి ఆరోపణలు, కేసులమాటేమిటి? వివిధ కేసులపై కోర్టుల్లో విచారణ జరగనీయకుండా స్టేలు తెచ్చుకునే కదా నిప్పు చంద్రబాబు సంవత్సరాలుగా కొనసాగుతున్నారు? అంతెందుకు ఓటుకునోటు కేసులో విచారణను ఎందుకు చంద్రబాబు అడ్డుకుంటున్నారు?
తనపైన పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితాలనేని జగన్ చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్, టిడిపిలు కలిసే కుట్ర చేసి తనను కేసుల్లో ఇరికించినట్లు చెబుతున్నారు. సరే, ఆయనపై ఉన్న కేసులు రాజకీయ ప్రేరేరిపితాలో లేక నిజంగానే అవినీతికి పాల్పడ్డాడో న్యాయస్ధానాలు తేలుస్తాయి. ఇప్పటికీ విచారణను ఎదుర్కొంటున్నారు, 16 మాసాలు జైలు జీవితం కూడా గడిపారు కదా? ఆయన కేసుల నుండి ఒక్కో పారిశ్రామికవేత్తకు, ఉన్నతాధికారులకు విముక్తి కూడా లభిస్తోంది. అంతేకానీ, తనపై విచారణ జరపకూడదంటూ జగన్ స్టేలు కోరలేదు కదా చంద్రబాబు లాగ?
అసలు చంద్రబాబుపై కోర్టుల్లో ఉన్న కేసులెన్ని? ఎన్ని కేసుల్లో విచారణను అడ్డుకుంటూ స్టేలు తెచ్చుకున్నారు? తనపై విచారణ జరగాల్సిన కేసుల్లో కోర్టులుగనుక స్టేలు ఇవ్వకపోతే చంద్రబాబు పరిస్ధితి ఎలాగుండేది? మొన్ననే ఓటుకునోటు కేసులో సుప్రింకోర్టు నుండి నోటీసులు అందుకోగానే చంద్రబాబు తల్లక్రిందులైపోలేదా? నిజం చెప్పాలంటే ప్రతీ ఒక్కళ్లలోనూ ఎన్నో బొక్కలున్నాయ్. తమలో అన్ని బొక్కలు పెట్టుకుని ఎదుటి వాళ్ళ బొక్కలను కెలకటం ఎందుకు?