నారాయణ స్కూల్ పై జగన్ ప్రభుత్వం కొరడా

Published : Jun 12, 2019, 11:53 AM IST
నారాయణ స్కూల్ పై జగన్ ప్రభుత్వం కొరడా

సారాంశం

వేసవి సెలవులు ముగించుకుని బుధవారం స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ స్థితిలో విద్యాశాఖ గుర్తింపు లేని పాఠశాల ఏరివేతకు చర్యలు చేపట్టింది.

విజయవాడ: గుర్తింపులేని పాఠశాలలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. గుర్తింపు లేని పాఠశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపిస్తోంది. విజయవాడ, సత్యనారాయణపురంలో గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్‌ను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారులు సీజ్‌ చేశారు. 

ఈ విషయమై యాజమాన్యానికి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా వైఖరి మారకపోవడంతో సీజ్‌ చేసి, లక్ష రూపాయల జరిమానా విధించారు. వేసవి సెలవులు ముగించుకుని బుధవారం స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ స్థితిలో విద్యాశాఖ గుర్తింపు లేని పాఠశాల ఏరివేతకు చర్యలు చేపట్టింది.

ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ల ఫీజుల నియంత్రణకు కమిషన్‌ వేయడంతో పాటు అర్హులైన పేదలందరినీ అమ్మ ఒడి ద్వారా ఆదుకుంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తొలి మంత్రివర్గ సమావేశంలోనే విద్యాశాఖలో సంస్కరణలు తేవడానికి రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

PREV
click me!

Recommended Stories

శ్రీ సిటీలో బాయిలర్ పేలుడుతో మాకు ఎలాంటి సంబంధం లేదు.. ట్యాబ్లెట్ ఇండియా క్లారిటీ
చంద్రబాబుపై శివరాజ్ సింగ్ పొగడ్తలు | Shivraj Singh Speech | Asianet Telugu