ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే ఆర్టీసిని కరోనా మరింత దెబ్బతీసింది.
విజయవాడ: ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే ఆర్టీసిని కరోనా మరింత దెబ్బతీసింది. ఈ ప్రజా రవాణా వ్యవస్థవల్ల వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం వుండటంతో వెంటనే ఆర్టీసి బస్సులను ఆపేశారు. ఇప్పుడు ఆర్టీసి బస్సులలు రోడ్డెక్కినా ప్రజలు అందులో ప్రయాణించేందుకు జంకుతున్నారు. దీంతో ఆర్టీసి ఆదాయం గణనీయంగా తగ్గింది. అంతేకాకుండా సిబ్బంది కూడా కరోనా బారిన పడుతుండటంతో లిమిటెడ్ గా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఏపిఎస్ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ వెల్లడించారు.
మే 22 నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీలో 19 మంది సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారని వెల్లడించారు.సిబ్బంది ఆరోగ్యం భద్రతా చర్యలకు అనుగుణంగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేశామని...వైరస్ వ్యాప్తిని ఆపడానికి కార్యాలయంలో ఉద్యోగులు "బేర్ మినిమమ్" పరిమితం చేశామన్నారు.
undefined
read more ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసి బస్సులు... కరోనా పరీక్షల తర్వాతే విధుల్లోకి సిబ్బంది
ప్రస్తుతం ఆర్టీసీలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కూడా నడవడంలేదని...కోవిడ్ వ్యాప్తి నివారణ దృష్ట్యా అవసరమైన వారిని మాత్రమే విధులకు పిలుస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఆర్టీసీలో కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాల తొలగించామంటూ ప్రచారం ఊపందుకుందని... అయితే ఇదంతా తప్పుడు ప్రచారమని ఎండీ కొట్టిపారేశారు.
ఏపిఎస్ ఆర్టీసిలో అవుట్ సోర్సింగ్/ కాంట్రాక్టు సిబ్బందిలో ఏ ఒక్కరి ఉద్యోగం రద్దు కాదని ఎండీ భరోసా ఇచ్చారు. కరోనా వల్ల ఆర్టీసీ ఆదాయం గణనీయంగా తగ్గిందని...ఈ అంశాన్ని సంబంధిత మంత్రి పేర్నినాని, సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.వారి సూచనల మేరకు తగు నిర్ణయం తీసుకుంటామని ఎండా ప్రతాప్ పేర్కొన్నారు.