గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని పొదిలి ప్రసాద్ బ్లాక్ రెండో అంతస్థులోని జనరల్ మెడిసిన్ వార్డులో వైద్యులు ఆ బాలికకు చికిత్స అందించారు.
ఆమె పట్ల విధి చిన్న చూపు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్పిన తండ్రి కామాంధుడిలా కాటు వేశాడు. తండ్రి చేసిన పాపపు పనితో నొప్పి భరించలేక ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ ఆమెను కరోనా కాటు వేసింది. తోడుగా ఉన్న తల్లికి కూడా కరోనా సోకింది. ఈ సంఘటన గుంటూరులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరుజిల్లా పెదనందిపాడులో ఓ కుటుంబం పొలం పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 7న తల్లీకూతుళ్లు నిద్రపోతున్న సమయంలో మద్యం సేవించి వచ్చిన తండ్రి.. 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేశాడు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని పొదిలి ప్రసాద్ బ్లాక్ రెండో అంతస్థులోని జనరల్ మెడిసిన్ వార్డులో వైద్యులు ఆ బాలికకు చికిత్స అందించారు. ఆరోగ్యం కుదుటపడ్డాక ఈ నెల 22న తల్లీకూతుళ్లకు కరోనా పరీక్ష నిర్వహించారు. మరుసటిరోజు ఫలితాలు రాగా.. ఇద్దరికీ పాజిటివ్‌గా తేలింది.
కానీ ఇవేమీ పట్టించుకోకుండా అదేరోజు వారిని డిశ్చార్జి చేశారు. రెండు రోజుల నుంచి వారు ఆస్పత్రి ఆవరణలోని సఖి కేంద్రంలోనే ఉంటున్నారు. వారికి కరోనా సోకిందనే సమాచారం వారికంటే ముందే పెదనందిపాడు పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో వారు.. సఖి కేంద్రాన్ని అప్రమత్తం చేశారు. తల్లీకూతుళ్లను కరోనా వార్డులో చేర్పించారు.