రేపటి నుంచి తెలంగాణకు బస్సులు.. రిజర్వేషన్ ప్రారంభం: ఏపీఎస్ఆర్టీసీ

Siva Kodati |  
Published : Jun 20, 2021, 09:57 PM IST
రేపటి నుంచి తెలంగాణకు బస్సులు.. రిజర్వేషన్ ప్రారంభం: ఏపీఎస్ఆర్టీసీ

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన నేపథ్యంలో రేపటి నుంచి తెలంగాణకు బస్సులు తిప్పేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన నేపథ్యంలో రేపటి నుంచి తెలంగాణకు బస్సులు తిప్పేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఇన్నాళ్లు లాక్ డౌన్ కారణంగా నిలిచిన అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో, ఇప్పటికే ఏపీకి బస్సులు తిప్పుతామని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించగా, తాజాగా ఏపీఎస్ఆర్టీసీ కూడా తెలంగాణకు బస్సులు తిప్పుతామని వెల్లడించింది. దీనిలో రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెలంగాణకు బస్సులు తిప్పుతామని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. విజయవాడ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు బస్సులు తిప్పనున్నట్టు పేర్కొంది. గుంటూరు జిల్లాలోని వివిధ డిపోల నుంచి హైదరాబాదుకు 12 బస్సులు తిరుగతాయని తెలిపింది.

Also Read:అన్నింటిపై ఆంక్షల ఎత్తివేత.. మరి ఎంఎంటీఎస్ పరిస్ధితి: కిషన్ రెడ్డి క్లారిటీ

అంతకుముందు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేతతో ఇతర రాష్ట్రాలకు సర్వీసులు నడవనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో రేపట్నుంచి ఏపీకి బస్సులు నడపనుంది టీఎస్ఆర్టీసీ. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏపీకి తెలంగాణ బస్సులు నడవనున్నాయి. అలాగే ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కర్ణాటకలోకి తెలంగాణ బస్సులు నడుస్తాయి. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu