వైసీపీ నేతల అఘాయిత్యాలు.. ప్రశ్నిస్తే కేసులా: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

Siva Kodati |  
Published : Jun 20, 2021, 04:57 PM IST
వైసీపీ నేతల అఘాయిత్యాలు.. ప్రశ్నిస్తే కేసులా: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు ప్రతిపక్షనేత, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లా పైడేరు కాలువలో వైసీపీ నేతల మట్టి మాఫియాను ప్రశ్నించినందుకు మల్లిఖార్జున్ అనే ఎస్సీ యువకుడిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. 

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు ప్రతిపక్షనేత, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లా పైడేరు కాలువలో వైసీపీ నేతల మట్టి మాఫియాను ప్రశ్నించినందుకు మల్లిఖార్జున్ అనే ఎస్సీ యువకుడిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మల్లిఖార్జున్‌ను తప్పుడు కేసులో ఇరికించిన కొడవలూరు పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డీజీపీని కోరారు. పోలీసులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి ఎస్సీ యువకుడిపై దాడి చేయడం దుర్మార్గమని టీడీపీ అధినేత ఖండించారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చర్యలు వున్నాయంటూ చంద్రబాబు మండిపడ్డారు. మల్లిఖార్జున్‌పై పెట్టిన కేసులను తక్షణం తొలగించాలని ప్రతిపక్షనేత డిమాండ్ చేశారు. 

Also Read:జగన్ కళ్లలో ఆనందం కోసమే.. చంద్రబాబు, లోకేష్‌లపై ఆరోపణలు: కొడాలి నానికి దేవినేని కౌంటర్

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్