ద్రోహం చేసిన బీజేపీతోనా, మంచి చేసే కాంగ్రెస్ తోనా:వైసీపీ,జనసేనలకు రఘువీరా

By Nagaraju TFirst Published Nov 21, 2018, 1:41 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలుపైనే ఉంటుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంలో వచ్చే ప్రభుత్వాలను బట్టే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఉంటుందని తెలిపారు. 
 

గుంటూరు:కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలుపైనే ఉంటుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంలో వచ్చే ప్రభుత్వాలను బట్టే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఉంటుందని తెలిపారు. 

గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న రఘువీరారెడ్డి బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు నాలుగేళ్లుగా తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి చెయ్యాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. 

పునర్విభజన చట్టంలోని హామీల అమలులోకానీ, ఏపీకి నిధుల విడుదలలో కానీ బీజేపీ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని రఘువీరా చెప్పుకొచ్చారు. ఏపీలోని అన్ని పార్టీలు ఏ జట్టులో ఉంటారో తేల్చుకోవాలని సూచించారు. ఏపీకి న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీ జట్టులో ఉంటారా..అన్యాయం చేస్తున్న బీజేపీ జట్టులో ఉంటారా తేల్చుకోవాలని సూచించారు. 

రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించకపోతే ఏపీకి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో 100 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలంగా ఉందని రఘువీరా తేల్చిచెప్పారు. ఏపీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని 72 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. వివిధ సర్వేలు రాహుల్ ప్రధాని కావాలని కోరుతుందన్నారు.   

ఈ వార్తలు కూడా చదవండి

ఆ ఇద్దరూ మోదీ, కేసీఆర్ ఏజెంట్లు:రఘువీరారెడ్డి

click me!