బాలకృష్ణ ఇంటి ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

Published : Nov 21, 2018, 10:50 AM IST
బాలకృష్ణ ఇంటి ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

సారాంశం

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ  ఇంటి ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు.

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ  ఇంటి ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇటీవల ప్రభుత్వం  220 మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగించారు. ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన వారు బాలకృష్ణ ఇంటిని చుట్టుముట్టారు.

హిందూపురంలో ఆయన నివాసం ఎదుట బైఠాయించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వెంటనే జీవో 279ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను పరిష్కరించే వరకు అక్కడి నుంచి వెళ్లమంటూ భీష్మించుకు కూర్చున్నారు. 

పరిసర ప్రాంతాల్లోని చెత్త అంతా ఏరుకు వచ్చి.. బాలకృష్ణ ఇంటి ముందు వేసి వారి ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. ఆందోళనను విరమించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

ఈ తోపులాటలో పలువురు కార్మికులు గాయాలపాలయ్యారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు