సూళ్లూరుపేట గ్యాంగ్‌రేప్: నిందితులని వదిలం, రంగంలోకి మహిళా కమీషన్

By Siva KodatiFirst Published Feb 7, 2019, 11:32 AM IST
Highlights

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌‌లో ఆదివారం రాత్రి మృగాళ్ల కామానికి బలైపోయిన బాధితురాలిని పరామర్శించారు ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని పరామర్శించిన ఆమె ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని, దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. వారికి ఉరిశిక్షపడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు నన్నపనేని తెలిపారు.

బాధిత యువతికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని, అలాగే ఆమెను ఆర్ధికంగా కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గత ఆదివారం రాత్రి విజయనగరం జిల్లాకు చెందిన ఓ యువతి ఇక్కడికి సమీపంలోని శ్రీసిటీలో పనిచేసే తన స్నేహితుడితో కలిసి రైల్వేస్టేషన్‌కు వచ్చింది.

అక్కడ గుర్తు తెలియని నలుగురు యువకులు.. స్నేహితుడిని కొట్టి యువతిని స్టేషన్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోకి లాక్కెళ్లారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

click me!